Breaking News

CHAKRASNANAM PERFORMED_ వేడుకగా వెంకన్న చక్రస్నానం


THOUSANDS TAKE HOLY DIP IN SWAMY PUSHKARANI

Tirumala, 18 October 2018: The last and one of the most important events during Srivari Navaratri Brahmotsavams where in thousands of pilgrims took part for taking bath in the Holy Swami Pushkarini , the Sudarshana Chakrasnana Mahotsavam, was performed with utmost religious fervour on Thursday.

SIGNIFICANCE

The Ayudha Pursha, anthropomorphic form of Lord Venkateswara, was rendered the celestial snapanam to the processional deities of Sri Malayappa Swamy, Sridevi, Bhu Devi and Sri Sudarshana Chakrattalwar. The deities were seated on the banks of Swamy Pushkarini in the front yard of Sri Bhu Varahaswamy temple.

The celestial snapanam commenced at 6 am. The fete commenced with Vishwaksena Aradhana, Punyahavachanam followed by Mukha Prakshalana. Later the snapanam was performed to the deities with milk, honey, coconut water, turmeric paste and sandal paste and the Vedic pundits recited Panchasuktas including Sri, Bhu, Neela, Purusha Suktams.

In the puranas, the Sudarshana Chakra was said to be made by the architect of gods, Vishwakarma. The Sudarshana Chakra is described to have 10 million spikes in two rows moving in opposite directions to give it a serrated edge. The Sudarshna Chakra is described as Prana, Maya, Kriya, Shakti, Bhava, Unmera, Udyama and Sankalpa. Sudarshana manifests in 5 main ways to wit the five Shaktis, which are creation, preservation, destruction, obstruction and obscuration.

It is observed as Upasamanotsavam for the deities, after a hectic eight-day and night Vahanam schedule during annual Brahmotsavams. The anthropomorphic form of Lord, Sri Sudarshana Chakrattalwar, will take a holy dip for three times in the sacred waters of Swamy Pushkarini to appease Him.

Supreme Court Judge Justice Indu Malhothra, AP Minister Sri Kollu Ravindra, TTD Chairman Sri Putta Sudhakar Yadav,TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, TTD Board Members Sri Rudraraju Padma Raju, Sri P Ramesh, Sri Ashok Reddy, Sri E Peddi Reddy, Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGOs Sri Raveendra Reddy, Smt Sadalakshmi, Temple Staff and devotees took part.
































ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

వేడుకగా వెంకన్న చక్రస్నానం

తిరుమ‌ల‌, 2018, అక్టోబ‌రు 18: శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజైన గురువారం ఉదయం 6 నుండి 9 గంటల నడుమ చక్రస్నానం వేడుకగా జరిగింది. విశేష సంఖ్యలో భక్తులు విచ్చేసి శ్రీవారి పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించారు.

బ్రహ్మోత్సవాలలో చివరిదైన చక్రస్నానం యజ్ఞాంతంలో ఆచరించే అవభృథస్నానమే. అవభృథస్నానంలో చక్రత్తాళ్వార్లకు పుష్కరిణిలో స్నానం నిర్వహించే ముందు వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో ఉభయదేవేరులతో కలిసి శ్రీవారి సరసన ఉన్న చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, తెనె, చందనంతో అర్చకులు అభిషేకం చేశారు. ఈ అభిషేక కైంకర్యాన్ని అందుకుని చక్రత్తాళ్వార్‌ ప్రసన్నుడయ్యాడు. చక్రస్నానం సమయంలో అధికారులు, భక్తులందరూ పుష్కరిణిలో స్నానం చేసి యజ్ఞఫలాన్ని పొందారు. పర, వ్యూహ, విభవ, అంతర్యామి, అర్చారూపాలలో స్వామి చివరి రూపమైన అర్చా విగ్రహానికి జరిగిన ఈ ఉత్సవాలను తిలకించడం ఎంతో పుణ్యఫలం.

అంతకుముందు తెల్లవారుజామున 3.00 నుండి 6.00 గంటల వరకు స్వామివారికి పల్లకీ ఉత్సవం వైభవంగా జరిగింది. అనంతరం రాత్రి 7.00 నుండి 9.00 గంటల మధ్య బంగారు తిరుచ్చి ఉత్సవంతో తొమ్మిది రోజుల పాటు జరిగిన శ్రీవారి న‌వ‌రాత్రి బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.

ఈ కార్యక్రమాల్లో టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాక‌ర్ యాద‌వ్‌, కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుప‌తి జెఈవో శ్రీ పోల భాస్క‌ర్‌, టిటిడి ధర్మకర్తల మండలి సభ్యులు శ్రీ ఇ.పెద్దిరెడ్డి, శ్రీ రుద్ర‌రాజు ప‌ద్మ‌రాజు, శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ అశోక్‌రెడ్డి, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాథ్, ఇతర అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 18, 2018 at 01:16PM


Read More http://news.tirumala.org/chakrasnanam-performed-2/

No comments