Breaking News

VAHANA SEVAS OF MALAYAPPA CULMINATES WITH ASWA_ అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు


Tirumala, 17 October 2018 : On the penultimate day of the ongoing Srivari Navaratri Brahmotsavams, Sri Malayappa Swamy who took the form of Kalki Avatar was taken for a celestial ride on Aswa vahanam in the Mada streets on the evening of Wednesday.

Riding the horse car Lord, displayed His stamina for speed and strength and enthralled the pilgrims who had descended on the hill shrine as the festival reaches conclusion.

The ‘Ashwa Vahanam’ procession denotes one of Lords most popular and well received avatars, Kalki – aGood Samaritan who fights evil and protects the righteous and good things in Kaliyuga.

TTD Chairman Sri Putta Sudhakar Yadav,TTD EO Sri Anil Kumar Singhal, Tirumala JEO Sri KS Sreenivasa Raju, TTD Board Members Sri Rudraraju Padma raju,P Ramesh ,Ashok reddy,Incharge CVSO Sri Sivakumar Reddy, Temple DyEO Sri Haridranath, Peishkar Sri Ramesh, VGOs Sri Raveendra Reddy, Smt Sadalakshmi, Temple Staff and devotees took part.


















ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTDs,TIRUPATI

అశ్వవాహనంపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడు

తిరుమల, 17 అక్టోబరు 2018: శ్రీవారి బ్రహ్మోత్సవాలలో 8వ రోజు బుధ‌వారం రాత్రి 8.00 నుండి 10.00 గంటల నడుమ శ్రీమలయప్పస్వామి వారు క‌ల్కి అలంకారంలో అశ్వవాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించాడు.

ఎనిమిదవరోజు రాత్రి స్వామివారు అశ్వంపై కూర్చొని, తనవేగశక్తినీ, బలశక్తినీ నిరూపిస్తుంటారు. వేగశక్తి అశ్వలక్షణం. సృష్టిలో యజ్ఞం తర్వాత పుట్టిన జీవి గుర్రమే! తర్వాతనే ఆవులూ, మేకలూ మున్నగు జంతువులు రూపొందాయి. ప్రయాణసాధనాల్లో మునుపు అశ్వానిదే అగ్రస్థానం. ఇప్పటికీ ఒకయంత్రంశక్తిని ‘హార్స్‌పవర్‌’ అనే పేరుతో గణించడం మనకు తెలుసు. రథాన్ని లాగేవి గుర్రాలే! యుద్ధాలలో ఆశ్వికదళం అధికంగా ఉంటుంది.

శ్రీహరి శ్రీనివాసుడై ఈలోకంలో వేంకటాచలం చేరి, అటనుండి పద్మావతీదేవిని పెండ్లాడడానికై మొట్టమొదట వేటనెపంతో గుర్రంపైన్నే వచ్చాడు. ఆ గుర్రమే తనకు వివాహవాతావరణాన్ని కల్పించడంలో ప్రముఖసాధనమైంది. శ్రీహరి యొక్క జ్ఞానావతారాల్లో మొదటిది హయగ్రీవావతారమే! అంటే గుర్రంముఖం కల్గినమూర్తి. హయగ్రీవుడు విద్యాధిదేవత. ఈకారణాలవల్లనూ స్వామికి బ్రహోత్సవవాహనసేవల్లో మొదట పెద్దశేషవాహనం కుండలినీ యోగానికి సంకేతమైతే – చివర అశ్వవాహనం ఓంకారానికి సంకేతమై – కుండలినీ యోగంతో ప్రణవాన్ని (ఓంకారాన్ని) చేరి, ఆనందించే తత్త్వాన్ని ఆద్యంత ఉత్సవాలు నిరూపిస్తున్నాయి. చక్కని సమన్వయాన్ని కల్గిస్తున్నాయి.

ఇంతేకాక ఈ కలియుగాంతంలో స్వామి కల్కిమూర్తియై గుర్రంపై పయనిస్తూ – ఖడ్గధారియై దుష్టశిక్షణం, శిష్టరక్షణం చేస్తాడని పురాణాలు పేర్కొన్నాయి. కనుక ఈ అశ్వవాహనత్వం కల్కి అవతారాన్ని గుర్తుచేస్తూంది. ఇంద్రునికి ఏనుగుతోపాటు గుర్రం కూడా వాహనంగా ఉంది. ఆధ్యాత్మికంగా పరమాత్మే అశ్వం. ఆయనే మనహృదయంలోఉండి, ఇంద్రియాల్ని నియమిస్తున్నాడు.

ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయ‌ర్‌స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయ‌ర్‌స్వామి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పుట్టా సుధాకర్‌యాదవ్‌, ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్, ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి స‌భ్యులు శ్రీ ఇ.పెద్దిరెడ్డి, శ్రీ ర‌మేష్‌బాబు, శ్రీ అశోక్‌రెడ్డి, జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 17, 2018 at 11:57PM


Read More http://news.tirumala.org/66120-2/

No comments