Breaking News

‘అరవింద’ వెంటపడితే వచ్చే ఆ కిక్కే వేరప్పా!


స్టార్స్‌ చిత్రాలలో హీరోలు హీరోయిన్ల కోసం వెంటపడటం అనేది.. వారిని మెప్పించడం కోసం నానాతంటాలు పడటం అనేది సహజంగా ఉండదు. హీరోయిన్లే హీరోల వెంటపడటం, వారితో డ్రీమ్‌ సాంగ్స్‌ వేసుకోవడం మామూలు. కానీ త్రివిక్రమ్‌ స్టైలే వేరు. ఆయన చిత్రాలలో హీరోయిన్ల అందాలను వర్ణించే పాటలు ఎంతో రంజుగా ఉంటాయి. ఇక హీరో మహేష్‌బాబు, సమంతల మధ్య ఇలా వచ్చే సీన్స్‌ గతంలో 'దూకుడు' చిత్రంలో ఓ రేంజ్‌లో అలరించాయి. ఇప్పుడు త్రివిక్రముడు కూడా వీరరాఘవుడి చేత అదే పని చేయిస్తున్నాడు. 

అరవింద వెంట పడి పాటలు పాడిస్తున్నాడు. 11వ తేదీన విడుదల కానున్న 'అరవింద సమేత వీరరాఘవ' చిత్రంలోని 'అనగనగా' అనే సాంగ్‌ వీడియో ప్రోమోని తాజాగా విడుదల చేశారు. ఇందులో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ హీరోయిన్‌ పూజాహెగ్డే వెనక పడుతూ ఆటపట్టిస్తున్నట్లుగా ఈ సాంగ్‌ ఉంది. 'అరెరెరె.. అరవిందట తనపేరు' అంటూ ఎన్టీఆర్‌ హీరోయిన్‌ పేరును చెబుతూ పాడుతున్న ఈ పాటలో తారక్‌ నేచురల్‌గా వేసే బీభత్సమైన స్టెప్స్‌కి బదులుగా ఎన్టీఆర్‌ చేసిన సందడి ఎంతో బాగుంది. ఇక ఎన్టీఆర్‌-పూజాహెగ్డేలు కూడా మేడ్‌ఫర్‌ ఈచ్‌ అదర్‌ అన్నట్లుగా ఉన్నారు. 

ఈ పాట వినేటప్పటి కంటే తెరపై కెమిస్ట్రీ అద్భుతంగా పండుతుందనే ఆశలను రేకెత్తిస్తోంది. ఇందులో ఎన్టీఆర్‌ గతంలో కంటే ఎంతో హ్యాండ్సమ్‌గా కనిపిస్తూ ఉండటం అభిమానులకు ఐఫీస్ట్‌ అనే చెప్పాలి. గతంలో ఎన్టీఆర్‌ 'రాకాసి రాకాసి' అనే పాట స్టైలే అయినప్పటికీ దానికి భిన్నమైన చిత్రీకరణ ద్వారా ఇందులో త్రివిక్రమ్‌ తనదైన స్టైల్‌ని చూపించాడని చెప్పాలి. 

Click Here fot Song Teaser



By October 07, 2018 at 10:55PM

Read More

No comments