Breaking News

లైంగిక వేధింపులు: ఒక చేత్తో చప్పట్లు సాధ్యమా?!


నిజానికి రాజకీయాలు, సినిమాలు అనేవి సమాజాన్ని, ప్రజలను, మీడియాను కూడా బాగా ఆకర్షిస్తాయి. కాబట్టే వారు చేసే చిన్న విషయం కూడా ప్రజల్లోకి బాగా వెళ్తుంది. బలంగా కూడా వెళ్తుంది. ఎందుకంటే వారిని ఆరాధించేవారు, వారిని స్ఫూర్తిగా తీసుకుని నడిచే వారే సమాజంలో ఎక్కువ. కాబట్టి ఇతరులు చేసే పనుల కంటే సెలబ్రిటీలుగా ఉండేవారు చేసే తప్పులు సమాజంపై తీవ్రప్రభావం చూపుతాయి. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన వారే అలా చేస్తే సామాన్యుల పరిస్థితి ఏమిటి? అనేది మొదట ఉదయించే ప్రశ్న. కాబట్టే అందరికంటే ప్రజా జీవితాలతో ముడిపడిన వారు, సంఘంలో ఉన్నత స్థానాలలో ఉండేవారు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. దీనిని మనం తప్పుపట్టలేం. కానీ సమాజంలో ఓ హీరో గానీ, రాజకీయ నాయకుడు గానీ, హీరోయిన్‌ గానీ రెండో పెళ్లి చేసుకున్నా కూడా అది వార్త, సంచలనం అవుతుంది. అలాగని అవి కేవలం ఆ రెండు రంగాలలోని వారే చేస్తున్నారా? అంటే కాదనే చెప్పాలి. 

నేడు రెండు, మూడు పెళ్లిళ్లు, సహజీవనాలు సమాజంలో సామాన్యులు కూడా చేస్తున్నారు. ఇక లైంగిక వేధింపులనేవి సాఫ్ట్‌వేర్‌ నుంచి కూలీలు, వారిపై అజమాయిషీ చేసేవారు, తమ కింద ఉద్యోగులు, మీడియాలో కూడా ఉన్నాయనేది వాస్తవం. పిల్లలకు విద్యాబుద్దులు నేర్పాల్సిన తండ్రుల వంటి గురువులు, సామాజిక బాధ్యత కలిగి ఫోర్త్‌ఎస్టేట్‌గా తామే నిజాయితీ, సామాజిక బాధ్యతలు తమకే ఉన్నాయని భావించే మీడియాలో కూడా ఇలాంటివి ఎన్నో. దీనికి తహల్కా ఆపరేషన్‌ని ఎంతో గట్స్‌తో చేసి తర్వాత ఓ లిఫ్ట్‌లోని మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన తరుణ్‌ తేజ్‌పాల్‌ నుంచి నాటి పోలీసు శాఖలో ఉన్నతోద్యోగి అయిన గిల్‌ వరకు ఇలాంటి వారు అన్ని చోట్లా ఉన్నారు. ఇక తాజాగా ఇదే విషయంపై సీనియర్‌ నటి కాజోల్‌ స్పందించింది. 

ఆమె మాట్లాడుతూ.. లైంగిక వేధింపులు అనేవి అన్నిరంగాలలో ఉంటాయి. అవి కేవలం సినీ పరిశ్రమకే పరిమితం కాదు. అన్నిచోట్లా జరుగుతున్నాయి. నేనెప్పుడు ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు ఎదుర్కొనలేదు. కానీ వీటి గురించి వింటూనే ఉన్నాను. లైంగిక వేధింపులకు పాల్పడే వారు ఎవ్వరూ అది మేమే చేశామని మీడియా ముందుకు రారు. నా కళ్ల ముందు ఇలాంటివి జరుగుతుంటే మాత్రం ఊరుకోను. విదేశాలలో వచ్చిన ‘మీటూ’ తరహా ఉద్యమం మనదేశంలో కూడా రావాల్సిన అవసరం ఉంది... అని చెప్పుకొచ్చింది. 

కానీ ఒకప్పుడు కేవలం తమ అవకాశాల కోసం ఇష్టపూర్వకంగా శృంగారానికి ఒప్పుకుని తర్వాత మగవారి మీదనే తప్పుతోసే వారు కూడా ఎందరో ఉన్నారు. ఏ తప్పు అయినా ఇద్దరు ఒప్పుకుంటేనే జరుగుతుంది. ఒక చేతితో చప్పట్లు సాధ్యమా? అనేది కూడా ఆలోచించాలి. 



By October 08, 2018 at 03:04AM

Read More

No comments