ఆ స్టార్ హీరో అల్లుడు వేధించాడు: హీరోయిన్!

కోలీవుడ్ యంగ్‌స్టార్ ధనుష్‌పై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. సుచీలీక్స్ నుంచి అమలాపాల్‌తో పాటు ఎందరితోనో ఆయనకు ఎఫైర్స్ ఉన్నాయనే నిజాలు బయటపడ్డాయని కోలీవుడ్ మీడియా కోడైకూస్తోంది. కానీ ఆయన ఇండియన్ సూపర్‌స్టార్ రజనీకాంత్ అల్లుడు కావడంతో ఆయన పేరును అందరు బయటపెట్టేందుకు భయపడుతున్నారని కూడా ఆరోపణలున్నాయి. తాజాగా దక్షిణాదిలో ధనుష్‌తో కలిసి 'అనేగన్' చిత్రంలో నటించిన అమైరాదస్తూర్ కూడా పేరు చెప్పడానికి భయపడినప్పటికీ ఇన్‌డైరెక్ట్‌గా ధనుష్‌నే ఉద్దేశించి పలు ఆరోపణలు చేసింది. ఈమె తెలుగులో రాజ్‌తరుణ్‌తో 'రాజుగాడు', సందీప్‌కిషన్‌తో 'మనసుకు నచ్చింది' చిత్రాల ద్వారా మన ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.
తాజాగా ఈమె మాట్లాడుతూ, దక్షిణాదికి చెందిన ఓ పెద్ద హీరోకి అల్లుడైన ఓ యంగ్‌స్టార్ నన్ను వేధించాడు. నా కెరీర్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం అతని పేరుని బయటపెట్టలేకపోతున్నాను. కానీ ఏదో ఒక రోజు అతని బండారం బయటపెట్టి తీరుతాను. నన్ను లైంగికంగా వేధించిన అతనిని మాత్రం ఊరికే వదిలిపెట్టను. ఉత్తరాది, దక్షిణాదిలో కూడా నాకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయి. ఉత్తరాదితో పోల్చుకుంటే దక్షిణాదిలోనే వేధింపులు ఎక్కువ. ఆ హీరోతో ఓ సినిమా చేస్తున్నప్పుడు నా శరీరంపై ఎక్కడెక్కడో చేతులు వేసి ఇబ్బంది పెట్డాడు. వెంటనే ఆ విషయం దర్శకుడికి చెప్పాను. ఈ విషయం తెలిసిన హీరో నాటి నుంచి షూటింగ్‌లలో నాకు నరకం చూపించాడు. షూటింగ్‌కి ఉదయం 8గంటలకే రమ్మనే వారు. తీరా రెడీ అయి వెళ్లితే సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఐదు నిమిషాలు మాత్రమే నాపై చిత్రీకరణ జరిపేవారు.
ఓ రోజు సాయంత్రం వరకు కూర్చొబెట్టి అసలు నాతో పనిచేయించుకోకుండానే పేకప్ చెప్పారు. అప్పటి నుంచి దక్షిణాది చిత్రాలు చేయాలంటేనే భయమేస్తోంది. పెద్దహీరోకి అల్లుడైన అతని పేరును నేను చెబితే నా కెరీర్‌ను నాశనం చేస్తారని భయపడి చెప్పడం లేదు. కానీ అతడిని మాత్రం వదలబోను. ఏనాటికైనా అతడిని బయటకీడుస్తాను... అని శపథం చేస్తూ హెచ్చరించింది. దీంతో ఆ పెద్ద హీరో అల్లుడు ఎవరనే దానిపై ప్రస్తుతం చర్చసాగుతోంది. కోలీవుడ్‌లో ధనుష్, శింబులపై ప్లేబోయ్ ముద్ర ఉన్న విషయం ఇక్కడ గమనార్హం.
By November 01, 2018 at 02:11AM
No comments