‘అరవింద సమేత’కి అన్నీ కలిసొస్తున్నాయ్
నిన్నమొన్నటివరకు జూనియర్ ఎన్టీఆర్ అంటే బాలకృష్ణ ఫ్యామిలీకి కాదు.. చంద్రబాబు కి కూడా పడేది కాదు. బావ చంద్రబాబు కోసమే బాలకృష్ణ... జూనియర్ ఎన్టీఆర్‌ని పెళ్లి తర్వాత ఎన్టీఆర్ తో సహా హరికృష్ణ ని పక్కన పెట్టేసాడు. హరికృష్ణ మాత్రం తన కొడుకులను ఒక్కటిగా చేర్చి... అండగా ఉన్నాడు. ఇక కళ్యాణ్ రామ్ కూడా నందమూరి బాలకృష్ణ ఫ్యామిలితో సఖ్యతను కొనసాగిస్తూ తమ్ముడు ఎన్టీఆర్‌తో మంచి అనుబంధం మెయింటింగ్ చేస్తున్నాడు. ఇక బాలకృష్ణ, ఎన్టీఆర్ ని అవాయిడ్ చెయ్యడంతో కన్ఫ్యూజన్ లో ఉన్న నందమూరి ఫ్యాన్స్.. ఎన్టీఆర్ సినిమాలను పట్టించుకోవడం మానేశారనే టాక్ ఎన్టీఆర్ - బోయపాటి సినిమా దమ్ము సినిమా విడుదలైనప్పటి నుంచి ప్రచారంలో ఉంది.
హిట్ అవ్వాల్సిన సినిమా కాస్తా.. నందమూరి ఫ్యాన్స్ వల్ల ఆ సినిమా ప్లాప్ అయ్యిందని అన్నారు. ఇక తర్వాత బాలయ్య ఫ్యామిలీ, హరికృష్ణ ఫ్యామిలీలు దూరం దూరంగానే ఉంటున్నాయి. ఇక చంద్రబాబు సీఎం అయిన టైం లో కూడా హరికృష్ణ ఫ్యామిలీ టిడిపికి దూరంగా ఉండడం కాదు.. టిడిపినే దూరం పెట్టేసింది. కానీ అరవింద సమేత సినిమా షూటింగ్ సమయంలో అంటే గత నెలలో హరికృష్ణ హఠాత్తుగా కన్ను మూయడంతో.. నందమూరి ఫ్యామిలీనే కాదు చంద్రబాబు కూడా హరికృష్ణ ఫ్యామిలీకి దగ్గరయ్యారు. హరికృష్ణ మరణంతో బాలకృష్ణ, చంద్రబాబు కూడా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ని దగ్గరికి తీసినట్లుగా బయటికొచ్చిన వీడియోస్, ఫొటోస్ తో నందమూరి ఫ్యాన్స్ అంతా మళ్ళీ ఎన్టీఆర్ కి దగ్గరయ్యారనే టాక్ నడిచింది.
ఇక ఎన్టీఆర్ గత సినిమాల విషయంలో నందమూరి ఫ్యాన్స్ మొత్తం ఎన్టీఆర్ సినిమాలను లైట్ తీసుకున్నారు కానీ.. ఎన్టీఆర్ - త్రివిక్రమ్ చిత్రమైన అరవింద సమేతకి మాత్రం నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉన్నా.. నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ మాత్రం దొరికింది. ఇప్పుడు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నందమూరి ఫ్యాన్స్ ఎన్టీఆర్ సినిమాని లేపుతారు. రేపు గురువారం విడుదలకాబోతున్న అరవింద సమేత మీద భారీ అంచనాలే ఉన్నాయి. ఇక హరికృష్ణ మరణాన్ని ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు జీర్ణించుకోలేకపోతున్నప్పటికీ... సినిమాని ఎలాగైనా హిట్ చెయ్యాలని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తో పాటుగా ఇప్పుడు నందమూరి ఫ్యాన్స్ కూడా కంకణం కట్టుకున్నారని అనిపిస్తుంది. చూద్దాం అరవిందకి నందమూరి ఫ్యాన్స్ సపోర్ట్ ఎలా ఉండబోతుంది అనేది.
By October 09, 2018 at 07:41AM
Read More
No comments