అలాంటి పాత్రలైతే చేస్తా: కౌశల్..!
బిగ్ బాస్ షో తో పాపులారిటీ సంపాదించుకున్న కౌశల్ కి అదృష్టం దరిద్రం పట్టుకున్నట్టు పట్టుకుంది. కౌశల్ కి బయట డిమాండ్ మాములుగా లేదు. అతను బిగ్ బాస్ నుండి బయటికి రాగానే పలు వాణిజ్య సంస్థలు క్యూ కట్టేశాయి. ప్రస్తుతం అతను కొన్ని వాణిజ్య కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. త్వరలోనే అవి టీవీలలో టెలికాస్ట్ కానున్నాయి. ఫిలిం సెలబ్రిటీలకు ధీటుగా అతను ఆదరణ సంపాదించుకున్నాడు.
త్వరలోనే అమెరికాలో అతడు షోస్ చేయనున్నాడు. నవంబర్‌లో అమెరికాకు వెళ్లి అక్కడ కొన్ని ఏరియాల్లో షోలు చేయనున్నాడట. అంతేకాదు అతనికి పలు సినిమాల నుండి ఆఫర్స్ కూడా వస్తున్నాయి. బోయపాటి ఇతనికి తన సినిమాలో ఓ మంచి రోల్ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. కౌశల్ కూడా విలన్ పాత్రలు చేయడానికి రెడీ అంటున్నారు. రీసెంట్ గా అతను ట్విట్టర్లో అభిమానులతో చిట్ చాట్ సందర్భంగా అతనీ వ్యాఖ్యలు చేశాడు.
నాకు ‘ధృవ’ సినిమాలో అరవింద్ స్వామి చేసిన పాత్రలు లాంటివి చేయడం అంటే చాలా ఇష్టం. ఆ తరహా విలన్ పాత్రలు వస్తే కచ్చితంగా చేస్తానన్నాడు. తన యాటిట్యూడ్‌కి అటువంటి పాత్రలే సూటవుతాయని చెప్పాడు. ప్రత్యేకంగా అనిపించే క్యారెక్టర్లే చేయాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇంత ఫాలోయింగ్ ఉంటుందనుకోలేదని..బయటికి వచ్చాక షాక్ అయ్యాయని అన్నాడు. ఈ విజయం కౌశల్ ఆర్మీకే సొంతం అని అన్నాడు.
By October 09, 2018 at 07:35AM
Read More
No comments