Breaking News

ఆ విజయ్ కూడా తక్కువోడు కాదండోయ్..!


తెలుగులో విజయ్‌దేవరకొండ ఎన్నికల వేడిలో ‘నోటా’ ద్వారా వస్తే తమిళ ఇళయదళపతి విజయ్‌ కూడా అలాంటి సంచలనాలకే సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే ‘మెర్సల్‌’ చిత్రం ద్వారా పెద్ద నోట్ల రద్దుని, జీఎస్టీ పరిధిలోకి కార్పొరేట్‌ వైద్యం, పెట్రోల్‌ వంటి వాటిని తీసుకుని రాకపోవడం, కార్పొరేట్‌ వైద్య దోపిడీలను చూపించి సంచలనం సృష్టించాడు. ఈ చిత్రం దేశవ్యాప్తంగా పలు చర్చలకు, వివాదాలకు కారణమై బిజెపి అధిష్టానం కూడా విజయ్‌పై ఓ కన్నేసి కక్ష్య తీర్చుకునే వరకు వెళ్లింది. దీనిని సమర్దించిన విశాల్‌ వంటి వారిపై కూడా బిజెపి కక్ష్య కట్టింది. 

ఇక తాజాగా మురుగదాస్‌ దర్శకత్వంలో ‘తుపాకి, కత్తి’ తర్వాత హ్యాట్రిక్‌ చిత్రంగా ‘సర్కార్‌’ వస్తోంది. మురుగదాస్‌ చిత్రాలలో సామాజిక అంశాలకు పెద్ద పీట వేస్తాడు. ప్రతి విషయాన్నిక్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి తప్పొప్పులకు తావు లేకుండా దేనినైనా ఎండగట్టడంలో ముందుండి, ప్రజలను ఆలోచింపజేస్తాడు. ఇక తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో రానున్న‘సర్కార్‌’ కూడా పొలిటికల్‌ థ్రిల్లరే అని తెలుస్తోంది. దీనికి తాజాగా విజయ్‌ చేసిన వ్యాఖ్యలు బలాన్ని చేకూరుస్తున్నాయి. 

నేనే ముఖ్యమంత్రిని అయితే, అవినీతిపైనే తన పోరాటం ఉంటుందని విజయ్‌ తెలిపాడు. ‘సర్కార్‌’ ఆడియో వేడుక సందర్భంగా విజయ్‌ మాట్లాడుతూ, పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ చిత్రానికి ఎ.ఆర్‌.రెహ్మాన్‌ సంగీతం ఇవ్వడంతో ఈ చిత్రానికి ఇప్పటికే ఆస్కార్‌ వచ్చినంత ఆనందంగా ఉన్నారు. ఇటీవల వచ్చిన నా చిత్రం ‘మెర్సల్’లో కొన్ని రాజకీయ సన్నివేశాలు ఉన్నాయి. తాజా ‘సర్కార్‌’ చిత్రంలో కూడా రాజకీయాలు అదిరిపోతాయి. 

ఈ చిత్రానికి ప్రేక్షకులు ఓటేస్తారని భావిస్తున్నాను. ఈ చిత్రంలో నేను నటించినట్లు నిజజీవితంలో కూడా ముఖ్యమంత్రిని అయితే సినిమాలో చేసినట్లు చేయబోను. అవినీతి నిర్మూలనకే ప్రాధాన్యం ఇస్తాను. పాలకులు అడ్డదారి తొక్కితే ఇతరులు కూడా అదే మార్గంలో పయనిస్తారు...అని చెప్పుకొచ్చాడు. మరి విజయ్‌ వ్యాఖ్యలని బట్టి చూస్తే ‘సర్కార్‌’ చిత్రంలో అవినీతి సీఎంగా విజయ్‌ ఏదో సంచలనాలకు రెడీ అవుతున్నాడనే అనిపిస్తోంది. హ్యాట్సాఫ్‌ టు విజయ్‌. 



By October 09, 2018 at 07:50AM

Read More

No comments