ఏం ఉందని ‘నోటా’లో చేసిందో మరి?
టాలీవుడ్ లో ఒకటో రెండో సినిమాలు చేస్తూ బిజీగా వుండే మెహరీన్ కి కాస్త లావుగా ఉండడంతో.. వచ్చిన చాలా అవకాశాలు చేజారిపోయాయి. వెంకి అట్లూరి - వరుణ్ తేజ్ సినిమాలో ఆమె బరువు కారణంగానే అమెకొచ్చిన ఛాన్స్ మిస్ అయ్యింది. ఆమె ప్లేస్ లో రాశిఖన్నా నటించడం ఆ సినిమా సూపర్ హిట్ అవడం జరిగింది. అయితే ఆ తర్వాత మెహరీన్ కాస్త బరువు తగ్గినా.. స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఛాన్స్ లు రాలేదు. అయితే తొలిప్రేమతో వరుణ్ తేజ్ పక్కన ఛాన్స్ మిస్ చేసుకున్న మెహరీన్ క్రేజీ స్టార్ హీరో అయిన విజయ్ దేవరకొండ పక్కన తమిళంలో ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన నోటా సినిమాకి సైన్ చేసింది. ఇక విజయ్ క్రేజ్ తో నోటా సినిమా తెలుగులోనూ, తద్వారా తమిళంలోనూ హిట్ అయితే అమ్మడుకి క్రేజ్ వస్తుందని ఒప్పుకుంది. ఇక తర్వాత వరుణ్ తేజ్ పక్కన ఎఫ్ 2 సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక మెహరీన్ కౌర్ తాజాగా నటించిన నోటా తెలుగు తమిళంతో పాటుగా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే నోటా సినిమాకి యావరేజ్ టాక్ పడింది. ఈ సినిమాలో విజయ్ నటన అతని యాటిట్యూడ్ కి మంచి మార్కులు పడుతుంటే.. హీరోయిన్ గా మెహరీన్ కౌర్ కి అయితే అసలు మార్కులు పడడం అటుంచి.. ఆమె ఈ సినిమాలో హీరోయిన్ పాత్ర చేసిందా అంటూ నోరెళ్ళ బెడుతున్నారు. జర్నలిస్ట్ పాత్రలో కేవలం నాలుగైదు సన్నివేశాల్లో కనబడిన మెహరీన్... విజయ్ దేవరకొండతో కలిసి కేవలం రెండు మూడు సీన్స్ లోనే కనబడింది.. అసలు మెహరీన్ ని హీరోయిన్ గా వాళ్ళెందుకు తీసుకున్నారో.. లేదంటే ఈమెందుకు నోటాలో హీరోయిన్ పాత్రకి ఒప్పుకుందో అనే సెటైర్స్ పడుతున్నాయి.
కేవలం విజయ్ దేవరకొండతో కలిసి నటిస్తే క్రేజొస్తుందని ఒప్పుకుందేమో అని కూడా అంటున్నారు. మరో పక్క నోటా సినిమాలో మెహరీన్ సీన్స్ కి ఎడిటింగ్ లో కత్తెర పడబట్టి.. ఆమె నోటా ప్రమోషన్స్ లో యాక్టీవ్ గా పాల్గొనలేదని.. చివరికి విజయ్ అడిగితే అతనితో కలిసి నోటా పబ్లిక్ మీట్స్ లో పాల్గొందనే టాక్ ఉండనే ఉంది. మరి హీరోయిన్ గా నటనకు స్కోప్ లేని పాత్రని మెహరీన్ ఎందుకు ఎన్నుకుంది. విజయ్ క్రేజ్ తో నోటా హిట్ అయితే తనకి తెలుగు, తమిళ్ అవకాశాలు వస్తాయనుకుందా? ఏమో తెలియదు కానీ.. ఇప్పుడు నోటా దెబ్బకి మెహరీన్ విలవిలాడుతోంది.
By October 08, 2018 at 04:16AM
Read More
No comments