Breaking News

బాబూ మారుతీ.. ఇక ఆపితే బెటర్!!


చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాలు తీసే రేంజ్ కి వెళ్ళిన మారుతీ చాలా తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్నాడు. ఒకపక్క సినిమా తీస్తూనే.. మరో పక్క సినిమాలు నిర్మిస్తూ.. కథలు, కాన్సెప్టులు అందిస్తూ.. ఇంకొన్ని సినిమాలకు దర్శకత్వ పర్యవేక్షణ చేస్తుంటాడు. అయితే గత కొన్ని సినిమాల నుండి మారుతీ ఏ సినిమా తీసినా.. ప్రొడ్యూస్ చేసినా అనుకున్న స్థాయిలో ఆడడం లేదు. రీసెంట్ గా మరోసారి చేతులు కాల్చుకున్నాడు మారుతీ.

ఇతని ప్రొడక్షన్ లో ఓ చిన్న సినిమా ఒక్కటి నిన్ననే రిలీజ్ అయింది. 'భలే మంచి చౌకబేరమ్' అనే చిన్న సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చి డిజాస్టర్ గా నిలిచింది. చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో నటించిన నటీనటులు పేర్లు కూడా చాలా మందికి తెలియవు. ఒక్క రాజా రవీంద్ర పేరు తప్ప. మొదటి ఆట నుండే చేతులు ఎత్తేసిన ఈ సినిమా వసూళ్లు రాబట్టటం కష్టమే అని అర్ధం అయిపోతుంది. శైలజారెడ్డి అల్లుడు సినిమా టైమ్‌లో ప్రయోగాలు చేయనని మారుతి క్లారిటీ ఇచ్చాడు.

కానీ ఓ ఎక్సపర్మెంట్  మూవీనే చేశాడు మారుతీ. డైరెక్షన్ తో  పాటు నటీనటులు పెర్ఫార్మన్స్ చాలా చెత్తగా ఉందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. గతంలో ఇతని బ్యానర్ నుండి  'బ్రాండ్ బాబు' అనే సినిమా వచ్చింది. ఇది కూడా డిజాస్టర్ గా నిలిచింది. ఇప్పుడు అదే రూట్ లో 'భలే మంచి చౌక బేరం' వచ్చింది. రీసెంట్ గా మారుతీ డైరెక్షన్ లో 'శైలజారెడ్డి అల్లుడు' సినిమా కూడా ప్లాప్ గా నిలిచింది. కానీ కలెక్షన్స్ మాత్రం పర్లేదు అనిపించుకుంది. సో ఇచ్చిన మాటకు కట్టుబడి ఇకనైనా మారుతి ఇలాంటి సమర్పించుకోవడాలు ఆపుకుంటే మంచిదేమో.



By October 08, 2018 at 03:55AM

Read More

No comments