‘మీటూ’ అంటూ బ్లాక్ మెయిల్ చేయవద్దు: రకుల్
దేశంలో మహిళలకు, బాల బాలికలకు ఎన్నో ప్రత్యేక రక్షణ చట్టాలు ఉన్నాయి. ఇక మైనర్ల పేరుతో కొందరు విచ్చలవిడితనానికి పాల్పడుతున్నారు. మరోవైపు మహిళలు కూడా తమకి ఉన్న ప్రత్యేక చట్టాలను దుర్వినియోగం చేస్తున్నారు. దళిత కార్డులు కూడా ఇలా కక్ష్యసాధింపు చర్యలకు కారణం అవుతున్నాయని కొందరు మేథావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కోడలికి తన తల్లిదండ్రులతో సమానమైన అత్తామామలను కనీసం వారి వృద్ధవయసులో ఆదరించకపోవడం, ఉమ్మడి కుటుంబంగా ఉంటే తమకు స్వేచ్చ ఉందని వేరు కాపురాలు పెట్టడం వంటివి జరుగుతూనే ఉన్నాయి.
నేటి రోజుల్లో ఒక యువకుడికి తమ కూతురిని ఇచ్చి వివాహం చేయాలంటే మొహమాటం లేకుండా అత్తామామలు ఉంటే వీలుకాదు. మా అమ్మాయి వారికి పని చేయలేదు. అత్తామామలు రాహుకేతువులు అని మొహం మీదనే అడిగేస్తున్నారు. మరోవైపు వృద్ధ తల్లిదండ్రులను పోషించి, వారి బాధ్యతలు స్వీకరించాల్సింది కుమారులే అని కోర్టులు కూడా తీర్పులని ఇస్తున్నాయి. దానికి భార్యలు అడ్డుచెప్పితే విడాకులులైనా తీసుకోవచ్చని న్యాయస్థానాలు చెప్పాయి. కానీ తల్లిదండ్రులు తమ కొడుకు, కూతురు సంతోషంగా ఉండాలని భావిస్తారే గానీ వారు తమ వల్ల విడాకులు తీసుకొని జీవితాలను నాశనం చేసుకోవాలనికోరుకోరు. నేటి భార్య కూడా రేపు కాబోయే అత్తే. మరి ఈ విషయం నేటి ఆడపిల్లలు, వారి తల్లిదండ్రులు ఎందుకు విస్మరిస్తున్నారో అర్ధం కావడం లేదు.
ఇక విషయానికి వస్తే ప్రస్తుతం 'మీటూ' ఉద్యమం ఊపందుకుంది. కొందరు నిజమైన దోషులతో పాటు కొందరు వీటి ద్వారా బ్లాక్ మెయిలింగ్‌కి గురవుతున్నారు. దీనిపై తెలుగు, తమిళంలో స్టార్ హీరోయిన్‌గా, బాలీవుడ్ లో కూడా గుర్తింపు తెచ్చుకున్న ఉత్తరాది భామ రకుల్ ప్రీత్‌సింగ్ స్పందించింది. ఆమె మాట్లాడుతూ.. మహిళలపై లైంగిక వేధింపులు, వారితో తప్పుగా బిహేవ్ చేయడం సరికాదు. అయితే పబ్లిసిటీ, బ్లాక్ మెయిలింగ్ కోసం మాత్రం ఈ ఉద్యమాన్ని వాడుకోవద్దు. ఈ ఉద్యమం మనదేశంలో రావడం ఎంతో సంతోషంగా ఉంది. లైంగిక వేధింపుల విషయంలో నేను అదృష్టవంతురాలిని. నేనెప్పుడు ఎవరిచేత వేధింపులకు గురికాలేదు. బాధితులంతా బయటకు వచ్చి నిర్భయంగా మాట్లాడటం ఆహ్వానించదగ్గ పరిణామం అని తెలిపింది. ఇక ఈ ‘మీటూ’ ఉద్యమం నిజాయితీగా సాగాలని, కక్ష్యసాధింపు, పబ్లిసిటీ, బ్లాక్ మెయిలింగ్‌లకి పాల్పకుండా నిజాయితీ ఉంటే మద్దతు పలుకుతామని కమల్‌హసన్, నందితాదాస్, తమిళ దర్శకుడు వారాహితో పాటు అందరూ ఇదే విషయాన్నినొక్కి వక్కాణిస్తుండటం గమనార్హం.
By October 18, 2018 at 02:16PM
No comments