ఈ న్యూస్ చాలు ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కి..!!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో అరవింద సమేత భారీ లెవెల్ లో రూపొందింది. ఎన్టీఆర్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమా బిజినెస్ కూడా అదే రేంజ్ లో జరుగుతుంది. రీసెంట్ గా ఈ సినిమా బిజినెస్ కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటికి వచ్చింది.
గత కొన్ని సినిమాల నుండి ఎన్టీఆర్ కు ఇప్పటి వరకు రాయచూర్ లో అదిరిపోయే కలెక్షన్స్ వస్తున్నాయి. ఎన్టీఆర్ కెరీర్ లో బెస్ట్ హిట్ గా నిలిచిన జనతా గ్యారేజ్ కు అక్కడ 65 లక్షలు వసూల్ చేసింది. ఇక జై లవ కుశ అయితే 74 లక్షలు వసూల్ చేసింది. అయితే అందరి అంచనాలు తలకిందులు చేస్తూ అరవింద సమేత బిజినెస్ కోటి పలికింది. ఈ లెక్కన ఈసినిమా ఎంత కలెక్ట్ చేయాలో అర్ధం చేసుకోండి.
బాహుబలి తర్వాత రాయచూర్ లో కోటి రేటు పలికిన ఓకే ఒక్క సినిమా ‘అరవింద సమేత’ కావడం విశేషం. పూజ హెగ్డే, ఇషా రెబ్బతో ఎన్టీఆర్ రొమాన్స్ చేయనున్నాడు. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో త్రివిక్రమ్, ఎన్టీఆర్ ల స్పీచ్ లు హైలైట్ గా నిలిచాయి. అన్ని అంచనాలు మధ్య ఈ సినిమా ఈనెల 11 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.
By October 05, 2018 at 01:03AM
Read More
No comments