పవన్‌కి ఆవేశం ఎక్కువ: విజయశాంతి!
టాలీవుడ్‌లో తొలి లేడీ సూపర్‌స్టార్‌గా, లేడీ అమితాబ్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ విజయశాంతి. నాడు ఆమె నటించిన ‘ప్రతిఘటన, వందేమాతరం, రేపటిపౌరులు, కర్తవ్యం, ఓసేయ్ రాములమ్మ’ వంటి చిత్రాలతో ఓ ఊపు ఊపింది. ఇక ఈమె చిరు, బాలకృష్ణలతో పాటు ఏ స్టార్‌తో కలిసి నటించినా కూడా ఈమెకంటూ ప్రత్యేకమైన పాత్రలను, యాక్షన్‌సీన్స్‌ని దర్శకనిర్మాతలు,రచయితలు ఉండేలా జాగ్రత్తలు తీసుకునే వారు. ‘శత్రువు, లారీడ్రైవర్, గ్యాంగ్‌లీడర్, జైతయాత్ర, సూర్య ఐపిఎస్’ వంటి స్టార్స్ చిత్రాలలో కూడా ఈమెకి మంచి ప్రాధాన్యం ఉండేవి. ఈమె కేవలం హీరోయిన్‌గా నటించిన చిత్రాలను కూడా తమిళనాట, ఇతర భాషల్లో డబ్ చేసేటప్పుడు అసలు స్టార్‌ని కాకుండా విజయశాంతి పేరు మీద, బొమ్మలు, పోస్టర్లు, టైటిల్స్‌ని మార్చేవారు. ఆ తర్వాత శ్రీనివాస ప్రసాద్‌ని వివాహం చేసుకున్నా కూడా తనకి ప్రజలే బిడ్డలని, తనకి సొంత బిడ్డలు వద్దని చెప్పింది.
శశికళ సైతం తాను జైలులో ఉన్నప్పుడు ఈమెని పిలిచి మరీ మాట్లాడింది. కానీ ఈమె రాజకీయంగా మాత్రం సరైన దారిలో నడవలేదు. బిజెపి అని, సొంత పార్టీ అని, టిఆర్‌ఎస్, కాంగ్రెస్.. ఇలా జంప్‌లు చేసి తనపై విమర్శలకు తావిచ్చింది. ఈ వ్యవహారాలే ఆమెని రాజకీయంగా ఎదగకుండా చేశాయనడంలో అతిశయోక్తిలేదు. మరలా కాంగ్రెస్ గూటికి చేరిన రాములమ్మ తాజాగా మాట్లాడుతూ.. ‘‘ఫెడరల్‌ఫ్రంట్‌కి పార్టీలను ఒప్పించలేకపోయిన కేసీఆర్ కాంగ్రెస్ మెడలు వంచి ప్రత్యేక తెలంగాణ తెచ్చానని చెప్పడం హాస్యాస్పదం. కేసీఆర్ అహంకారపూరితమైన మాటలను ప్రజలు గమనిస్తున్నారు. టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు. ప్రచారం మాత్రమే నిర్వహిస్తాను. రాష్ట్ర వ్యాప్తంగా 430 మండలాలలో ప్రచారం చేస్తానని రాహుల్‌గాంధీకి మాట ఇచ్చాను. ఎన్నికల ప్రచార షెడ్యూల్‌పై కసరత్తు చేస్తున్నాం. మహాకూటమి ఆహ్వానించదగ్గ పరిణామం.
ఈ కూటమి ద్వారా కేసీఆర్‌ని గద్దె దింపడం సాధ్యమే. బడుగు బలహీన వర్గాలకు కాంగ్రెస్ పెద్ద పీట వేయాలి. కాంగ్రెస్ పార్టీ నేత చిరంజీవితో కలసి ప్రచారం చేయడానికి నేను సిద్దమే. పవన్‌కి ఆవేశం ఎక్కువ. మరి రాజకీయాలలో ఆయన ఎదుగుతాడో లేదో వేచిచూడాలి..’’ అని చెప్పుకొచ్చింది. నిజమే.. చిరంజీవి కాంగ్రెస్‌లో ఉన్నాననే విషయమే మర్చిపోయినట్లు ఉన్నాడు. ఆయన కూడా కాంగ్రెస్ తరపున ప్రచారంచేస్తే తెలంగాణ, ఏపీ రెండింటిలో కాంగ్రెస్‌కి కాస్త ఊపు వస్తుందనే చెప్పాలి.
By October 04, 2018 at 02:07PM
Read More
No comments