మొత్తానికి ‘పడిపడి లేచే..’ అప్‌డేట్ వచ్చింది
పడిపడి లేచే మనసు సినిమా టీజర్ ను అక్టోబర్ 10న విడుదల చేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. కోల్ కత్తా, నేపాల్ లోని అందమైన ప్రదేశాల్లో ఈ చిత్రాన్ని చిత్రీకరించారు హను. ప్రస్తుతం హైదరాబాద్ లో షెడ్యూల్ జరుగుతుంది. షూటింగ్ చివరిదశలో ఉంది పడిపడి లేచే మనసు. ఈ చిత్రంలో మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఇతర కీలకపాత్రల్లో నటిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. శర్వానంద్, సాయిపల్లవి నటన సినిమాకు హైలైట్ కానుంది. వీళ్ల కెమిస్ట్రీ ఫస్ట్ లుక్ లోనే అద్భుతంగా వర్కవుట్ అయింది. దర్శకుడు హను రాఘవపూడి టేకింగ్ పడిపడి లేచే మనసుకు మరో హైలైట్. విశాల్ చంద్రశేఖర్ ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ కు సంగీతం అందిస్తున్నారు. జయకృష్ణ గుమ్మడి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డిసెంబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా పడిపడి లేచే మనసు విడుదల కానుంది.
By October 09, 2018 at 07:55AM
Read More
No comments