Breaking News

శ్రీరెడ్డిలాంటి వారిపై పోరాటానికి ‘వుయ్‌టూ మెన్‌’!


ప్రస్తుతం నటీమణులపై పురుషులు చేస్తోన్న లైంగిక వేధింపులపై ‘మీటూ’ ఉద్యమం ఉదృతంగా నడుస్తోంది. దేశవ్యాప్తంగా అందరూ మహిళలపై మరీ ముఖ్యంగా నటీమణులపై జరుగుతున్న దాడులను చర్చించుకుంటున్నారు. ఇక లైంగిక వేధింపులు కేవలం సినీ రంగంలోనే కాదని అన్ని రంగాలలో ఉన్నాయని కొందరు చెబుతున్నారు. గతంలో ‘రేసుగుర్రం’తో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితమైన భోజ్‌పురి స్టార్‌ రవికిషన్‌ వంటి వారే కాదు.. బాలీవుఢ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ నుంచి ఎందరో మహిళలు, నటీమణులు కూడా పురుషులపై కూడా లైంగిక వేధింపులు ఉంటాయని చెప్పారు. అందమైన హీరోలను లైంగిక సుఖం తీర్చమని వేధించే పెద్ద మనుషులు కూడా ఉన్నారని వారు వెల్లడించారు. 

నటీమణుల విషయంలో లైంగిక వేధింపులు అంటే.. నటులుగా మారాలని భావించే పురుషులను డబ్బులు తెమ్మని వేధిస్తూ ఉంటారు. తాము అడినంత డబ్బు ఇస్తేనే నటునిగా అవకాశం ఇస్తామని ఎందరో దర్శకనిర్మాతలు ఒత్తిడి చేస్తూ ఉంటారు. ఇది కూడా ఓ విధమైన వేధింపే. ఇక భర్తల నుంచి వేధింపులు అందుకునే భార్యలు ఎలా ఉన్నారో.. అలాగే భార్యాబాధితులు కూడ ఎందరో ఉన్నారు. నేడు భార్యాబాధితులు కూడా ముందుకు వచ్చి సంఘాలను స్థాపిస్తున్నారు. సినిమా ఫీల్డ్‌లో ఉండే మరో ఘోరం ఏమిటంటే.. ఎవరైనా నటునికి కొత్తగా అవకాశం ఇస్తే, నటీమణులతో వారు సన్నివేశాలు చేసేటప్పుడు నటీమణులను ఆకట్టుకోవడం కోసం నటుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తూ ఉండటం కూడా కామనే. ఇలా వేధింపులు అనేవి రెండు చోట్లా ఉన్నాయి. కానీ దేశంలోని చట్టాలు మహిళలకు అనుకూలంగా ఉండటంతో వీటి గురించి ఎవ్వరూ పట్టించుకోవడం లేదు. 

ఇక విషయానికి వస్తే.. సినీపరిశ్రమలో మహిళలను వేధించే వారు ‘మీటూ’ ఉద్యమం నడుపుతున్నారని, ఈ ఉద్యమాన్ని ఆసరాగా తీసుకుని కొందరు మహిళలు బెదిరింపులకు పాల్పడుతున్నారని ప్రముఖ జర్నలిస్ట్ వారాహి తెలిపాడు. ఆయన మాట్లాడుతూ, మహిళల నుంచి ఇలాంటి బ్లాక్‌మెయిల్స్‌ని అరికట్టి నిజాయితీ కలిగిన పురుషుల కోసం నేను ‘మీటూ మెన్‌’ ఉద్యమం ప్రారంభించాను. సినిమాలలో పాత్రలు కావాలంటే కాంప్రమైజ్‌ కావాల్సిందేనని ఎందరినో వేధింపులకు గురిచేసిన శ్రీరెడ్డి ప్రస్తుతం టాలీవుడ్‌ నుంచి కోలీవుడ్‌కి వచ్చింది. ఆదిలోనే ఆమెకు మేము నిరసన తెలిపాం. శ్రీరెడ్డిలాంటి వారెందరో సినీ ప్రముఖులపై ఉద్దేశ్యపూర్వంగా ఆరోపణలు చేస్తున్నారు. ఇలాంటి వారి నుంచి అమాయకులైన పురుషులను కాపాడేందుకే ఈ ‘వుయ్‌టూ మెన్‌’ ఉద్యమాన్ని ప్రారంభించాను. 

ఐదేళ్ల కిందట పరస్పర అంగీకారంతో ఓ పారిశ్రామికవేత్తకి, ఒక నటికి మధ్య చోటుచేసుకున్న వ్యక్తిగత సంబంధం గురించి ఇప్పుడు బయట బయటపెడతామని, అలా ఆ వివరాలను వెల్లడించకుండా ఉండాలంటే ఏకంగా మూడు కోట్లు తనకి ఇవ్వాలని ఆ నటి ఆ పారిశ్రామికవేత్తను బెదిరిస్తోంది. ఇలాంటి వాటిని ఎదుర్కొనేందుకే ‘వుయ్‌టు మెన్‌’ ఉద్యమం ప్రారంభించామని వారాహి తెలిపాడు. మొత్తానికి వారాహి ఆలోచనలో కూడా 100శాతం నిజం ఉందనే చెప్పాలి. బాధిత పురుషుల కోసం ఆయన ప్రారంభించిన ఉద్యమం కూడా ఊపందుకోవాలని కోరుకుందాం! 



By October 18, 2018 at 10:21AM


Read More http://www.cinejosh.com/news-in-telugu/4/43066/wetoo-men.html

No comments