2500 మంది సిబ్బందితో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రత – టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
2500 మంది సిబ్బందితో శ్రీవారి బ్రహ్మోత్సవాలకు భద్రత – టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి
తిరుమల, 17 అక్టోబరు 2018: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు టిటిడి నిఘా, భద్రతా విభాగం ఆధ్వర్యంలో 2500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తులు ప్రశాంతమైన వాతావరణంలో వాహనసేవలను తిలకించారని టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివకుమార్‌రెడ్డి తెలిపారు. తిరుమలలోని రాంభగీచా-2లో గల మీడియా సెంటర్‌లో బుధవారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా శ్రీ శివకుమార్‌రెడ్డి మాట్లాడుతూ ముగ్గురు విఎస్‌వోలు, ఏడుగురు ఏవిఎస్వోలు, 8 మంది విజిలెన్స్ ఇన్స్‌పెక్టర్లతోపాటు
300 మంది సెక్యూరిటీ గార్డులు, ఇతర జిల్లాల నుండి 400 మంది హోంగార్డులు, 800 మంది శ్రీవారి సేవకులు, 700 మంది స్కౌట్స్ అండ్ గైడ్స్, 200 ఎన్‌సిసి క్యాడెట్లు, 26 మంది స్విమ్మర్లు, 8 మంది రిటైర్డ్ విజిలెన్స్ అధికారులు భక్తులకు సేవలందించినట్టు తెలిపారు. మాడ వీధుల్లో రోప్ పార్టీలు, గ్యాలరీలు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1, 2లో బందోబస్తు, అలిపిరి, శ్రీవారిమెట్టు మార్గాల్లో భద్రతా ఏర్పాట్లు, భక్తుల లగేజిని స్వీకరించి, తిరిగి అప్పగించడం తదితర విధులు నిర్వహించామన్నారు. ఈసారి పోలీసులు, టిటిడి విజిలెన్స్ సిబ్బంది సమన్వయం చేసుకుని ఎవరికి అప్పగించిన విధులను వారు క్రమశిక్షణతో నిర్వహించారని చెప్పారు.
మొదటి దశలో శ్రీవారి ఆలయం, మాడ వీధులు, గ్యాలరీల్లో 285 సిసి కెమెరాలు ఏర్పాటుచేశామని, రెండో దశలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, తిరుమలలోని ఇతర ముఖ్యమైన కూడళ్లలో 800 సిసి కెమెరాలు ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించామని ఇన్‌చార్జి సివిఎస్వో వివరించారు. వాహనాలు అలిపిరిలో మొదలైనప్పటి నుండి తిరుమలకు చేరుకుని తిరిగి వెళ్లేంతవరకు పూర్తి సమాచారం తెలుసుకునేలా జిపిఎస్ వ్యవస్థను మూడు నెలల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. టిటిడి సెక్యూరిటీ గార్డులకు దశలవారీగా శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు.
ఈ మీడియా సమావేశంలో టిటిడి విఎస్‌వోలు శ్రీ రవీంద్రారెడ్డి, శ్రీమతి సదాలక్ష్మి పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 17, 2018 at 03:14PM
No comments