శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట – దాదాపు 6.54 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్

ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI
శ్రీవారి బ్రహ్మోత్సవాలలో సామాన్య భక్తులకు పెద్దపీట – దాదాపు 6.54 లక్షల మందికి సంతృప్తికరంగా శ్రీవారి దర్శనం ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ హరీంద్రనాధ్
తిరుమల, 17 అక్టోబరు 2018: శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా 7 రోజుల్లో దాదాపు 6.54 లక్షల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పించినట్లు శ్రీవారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ హరీంద్రనాధ్ తెలిపారు.
బుధవారంనాడు రాంభగీచా 2లోని మీడియా సెంటర్‌లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బ్రహ్మోత్సవాల్లో విఐపి దర్శనాలు, రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను తగ్గించి సామాన్య భక్తులకు పెద్దపీట వేశామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా క్యూలైన్లు నిర్వహణ, తక్కువ వ్యవధిలో సంతృప్తికర దర్శనం కల్పించినట్లు వివరించారు. స్వామివారి వాహన సేవలు వీక్షించిన భక్తులందరికి శ్రీవారి దర్శనం కల్పించినట్లు తెలిపారు. శ్రీవారి కైంకర్యాల సమయంలో తప్ప మిగిలిన సమయం అంతా శ్రీవారిని దర్శించుకున్నట్లు వివరించారు. భక్తులకు స్వామివారి అన్న ప్రసాదాలు అధికంగా పంపిణీ చేసినట్లు తెలియజేశారు.
కాగా అక్టోబరు 14వ తేదీ గరుడసేవనాడు లక్ష మందికి పైగా భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. శ్రీవారి భక్తలకు ఇప్పటివరకు దాదాపు 24.36 లక్షల లడ్డూలు అందించామన్నారు. బ్రహ్మోత్సవాలలో భక్తుల సౌకర్యార్ధం ముందస్తుగా 7 లక్షల లడ్డూలు సిద్ధంగా వుంచినట్లు తెలిపారు.
అదేవిధంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 7.15 లక్షల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నట్లు తెలిపారు. సెప్టెంబరు 17వ తేదీ గరుడసేవ సందర్భంగా దాదాపు 85 వేల మందికి శ్రీవారి దర్శనం కల్పించామన్నారు. సాలకట్ల బ్రహ్మోత్సవాలలో దాదాపు 26.30 లక్షల లడ్డూలు భక్తులకు అందించినట్లు తెలిపారు. ప్రతి రోజు శ్రీవారి వాహన సేవల్లో అర్చకులు ప్రత్యేకంగా అలంకరణలు చేసినట్లు తెలియజేశారు.
శ్రీఅనిల్‌కుమార్ సింఘాల్ సారధ్యంలో, తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు నేతృత్వంలో అధికారులు, సిబ్బంది సమష్టిగా పనిచేసి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేశామని ఆయన వెల్లడించారు.
శ్రీవారి హుండి ద్వారా 16.14 కోట్లు లభించింది : పరకామణి డెప్యూటీ ఈవో శ్రీ వి.దామోదరం
శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో హుండి ద్వారా ఈ ఏడాది 7 రోజులకు రూ. 16.14 కోట్లు లభించినట్లు తెలిపారు. అదేవిధంగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో 9 రోజులకు హుండి ద్వారా రూ.16.28 కోట్లు లభించినట్లు వెల్లడించారు.
శ్రీవారి పరకామణి సేవకుల సహకారంతో స్వామివారి కానుకలను ఎప్పటికప్పుడు లెక్కింపు పూర్తిచేసి బ్యాంకులలో డిపాజిట్ చేస్తున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా. టి.రవి, పేష్కార్లు శ్రీ రమేష్‌బాబు, శ్రీ నాగరాజ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.
By TTD News October 17, 2018 at 03:11PM
No comments