Breaking News

చక్రస్నానం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష






ISSUED BY PUBLIC RELATIONS OFFICER, TTD, TIRUPATI

చక్రస్నానం ఏర్పాట్లపై జెఈవో సమీక్ష

తిరుమల, 2018 అక్టోబర్ 17: శ్రీవారి బ్రహ్మోత్సవాల చివ‌రి రోజైన గురువారం ఉద‌యం జ‌రుగ‌నున్న చ‌క్ర‌స్నానం ఏర్పాట్ల‌పై బ్రహ్మోత్సవాల కంట్రోల్ రూమ్‌లో బుధవారం ఉదయం టిటిడి తిరుమ‌ల జెఈవో శ్రీ కె.ఎస్‌.శ్రీ‌నివాస‌రాజు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ భ‌క్తులు పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించేందుకు, తిరిగి వెలుప‌లికి వెళ్లేందుకు వీలుగా గేట్ల‌ను ఏర్పాటు చేయాలన్నారు. టిటిడి అధికారులు, విజిలెన్స్‌, పోలీసులు స‌మ‌న్వ‌యం చేసుకుని భ‌క్తుల‌కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ఉద‌యం 6 గంటల నుండి 9 గంట‌ల మ‌ధ్య శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ మ‌ల‌య‌ప్ప‌స్వామివారి ఉత్స‌వ‌మూర్తుల‌కు, చ‌క్ర‌త్తాళ్వార్‌కు స్న‌ప‌న‌తిరుమంజ‌నం, చ‌క్ర‌స్నానం నిర్వ‌హిస్తామ‌ని తెలిపారు.

ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పుష్కరిణిలో ఈతగాళ్లను, బోటును అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. చక్రస్నానాన్ని భక్తులు వీక్షించేందుకు వీలుగా ఆలయ పరిసరాల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఏర్పాటుచేయాలన్నారు.

నిర్దేశించిన గేట్ల ద్వారా పుష్క‌రిణిలోకి ప్ర‌వేశించాల‌ని, భక్తులు సంయమనం పాటించి టిటిడికి సహకరించాలన్నారు. చక్రస్నానం రోజున రోజంతా పవిత్ర ఘడియలు ఉంటాయని భక్తులు ఎప్పుడైనా పుష్కరిణిలో స్నానం చేయవచ్చని జెఈవో విజ్ఞప్తి చేశారు.

ఈ స‌మావేశంలో టిటిడి ఇన్‌చార్జి సివిఎస్వో శ్రీ శివ‌కుమార్‌రెడ్డి, ఎస్ఇలు శ్రీ రామ‌చంద్రారెడ్డి, శ్రీ వేంక‌టేశ్వ‌ర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.



By TTD News October 17, 2018 at 03:16PM


Read More http://news.tirumala.org/jeo-9/

No comments