Breaking News

‘2.ఓ’పై ఈ వార్త నిజమేనా?


శంకర్‌ దర్శకత్వంలో ఇండియన్‌ సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ హీరోగా, బాలీవుడ్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ ప్రతినాయక పాత్రల్లో రూపొందుతున్న దేశంలోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా '2.ఓ'కి విపరీతమైన క్రేజ్‌ ఏర్పడుతోంది. కేవలం కొన్ని సెకన్ల టీజరే సంచలనం సృష్టించి, ఇందులో విజువల్‌ ఎఫెక్ట్స్‌, విఎఫ్‌ఎక్స్‌లు హాలీవుడ్‌ని తలదన్నే విధంగా ఉన్నాయనే నమ్మకాన్ని కలిగించింది. ఈ చిత్రం కోసం ఇంత ఆలస్యం కావడం ఎందుకో ఈ టీజరే సమాధానం ఇచ్చింది. ఇక వర్క్‌లోనూ, బడ్జెట్‌లోనూ ఏమాత్రం కాంప్రమైజ్‌ కాని శంకర్‌ని లైకా ప్రొడక్షన్స్‌ అధినేతలు అంతగా నమ్మి అడిగినవన్నీ చేకూర్చడం వల్లే ఈ అవుట్‌పుట్‌ బ్రహ్మాండంగా ఉంటుందని అందరు ఆశిస్తున్నారు. 

కానీ కొందరు మాత్రం హీరోయిన్‌గా అమీజాక్సన్‌ని తీసుకోవడంపై మాత్రం విమర్శలు గుప్పించారు. ఈ చిత్రం బడ్జెట్‌కి, స్టార్‌ క్యాస్టింగ్‌కి, సాంకేతిక నిపుణులకు ధీటుగా అమీజాక్సన్‌ ఎంపిక లేదనే నిరుత్సాహం కూడా వ్యక్తం చేశారు. అయితే '2.ఓ' యూనిట్‌ ఈ విషయంలో బాగానే వర్కౌట్‌ చేసిందని అర్ధమవుతోంది. 'రోబో' చిత్రంలో ఐశ్వర్యారాయ్‌ కోసం చిట్టి చేసే దారుణాలు, విన్యాసాలు మామూలుగా ఉండవు. ఇప్పుడు '2.ఓ'లో కూడా చిట్టి స్నేహితురాలి పాత్రలోనే ఐశ్వర్యారాయ్‌ని కొంత సేపు చూపించనున్నారట. 

అసలే అక్షయ్‌కుమార్‌, రజనీకాంత్‌లకి తోడు ఐశ్వర్యారాయ్‌ ఉందంటే దీనికి దేశంలోని అన్ని భాషలతో పాటు బాలీవుడ్‌లో కూడా అంచనాలు మరింతగా పెరిగే అవకాశం ఉంది. 500కోట్లకు పైగా రూపొందుతున్న ఈ చిత్రం నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఐశ్వర్యారాయ్‌ రోబో తరహాలోనే ప్రేక్షకులను మెప్పిస్తుందా? లేదా? అనేది వేచిచూడాల్సివుంది...! 



By October 01, 2018 at 08:51AM

Read More

No comments