Breaking News

‘మహర్షి’ వ్యవహారం మళ్లీ మొదటికి..!


మహేష్ బాబు - వంశి పైడిపల్లి కాంబోలో మహేష్ కెరీర్ లోనే మైలు రాయి అయిన మహేష్ 25  వ సినిమా 'మహర్షి' తెరకెక్కుతుంది. మహేష్ కెరీర్ లో ఈ 'మహర్షి' మూవీ బెస్ట్ మూవీగా ఉండాలని వంశి పైడిపల్లి తగిన జాగ్రత్తలు తీసుకుని మరీ ఈ సినిమా షూటింగ్ చేస్తున్నాడట. ఇక నిర్మాతలు దిల్ రాజు, పీవీపీ, అశ్వినీదత్ లు కూడా వంశి అడిగినదల్లా కాదనకుండా సమకూరుస్తున్నారట. ఇక ఈ సినిమా షూటింగ్ మొదలవ్వడానికి చాలా సమయం తీసుకుంది. కనుకనే రెగ్యులర్ షూటింగ్ మొదలైనప్పటి నుండి షూటింగ్ కి ఎటువంటి విరామం ఇవ్వడం లేదు చిత్ర బృందం. ఇక మహేష్ కూడా వంశితో కలిసి కష్టపడుతున్నాడు. 

అమెరికా షెడ్యూల్ లేట్ అయినప్పటికీ... మధ్యలో హైదరాబాద్ షెడ్యూల్ ని కంప్లీట్  చేసేసింది 'మహర్హి' చిత్ర బృందం. అయితే శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ 'మహర్షి' సినిమాపై ఒక రూమర్ సోషల్ మీడియాలోనూ, ఫిలింసర్కిల్స్ లోను స్ప్రెడ్ అయ్యింది. అదేమిటంటే.. ఇప్పటి వరకు జరిగిన షూటింగ్ అవుట్ ఫుట్ ని మహేష్ తో కలిసి దర్శకుడు వంశి, నిర్మాతలు చూశారట. కానీ మహేష్ కీలకమైన కొన్ని సన్నివేశాలు తాను ఆశించినట్టుగా రాలేదంటూ అసంతృప్తిని వ్యక్తం చేశాడట. అంతేకాకుండా ఆ సన్నివేశాలను రీ షూట్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడట. 

ఇక మహేష్ చెప్పిన విషయానికి దర్శకుడు వంశి, నిర్మాతలు దిల్ రాజుతోపాటుగా..పీవీపీ, అశ్వినీదత్ లు కూడా ఒప్పుకున్నట్లుగా ఫిలింనగర్ టాక్. మరి ఇందులో నిజమెంతుందో తెలియదు గాని సోషల్ మీడియాలో మాత్రం మహేష్ మహర్షికి రీ షూట్ అంటూ ప్రచారం మొదలైంది. ఇక పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో మరో హీరో అల్లరి నరేష్ కీలకమైన అంటే మహేష్ ఫ్రెండ్ రోల్ లో నటిస్తున్నాడు. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నాడు.



By October 01, 2018 at 05:54PM

Read More

No comments