‘సాహో’కి ‘బాహుబలి’ అస్సలు సరిపోదట..!
ప్రభాస్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు, దేశవ్యాప్తంగా ప్రభాస్ అభిమానులు 'బాహుబలి' చిత్రం ద్వారా నేషనల్ స్టార్‌గా మారిన ప్రభాస్ మూవీ 'బాహుబలి' ఒన్ మూవీ వండర్ కాకూడదని, ఆయన తదుపరి సుజీత్ దర్శకత్వంలో హాలీవుడ్ యాక్షన్ తరహాలో రూపొందుతున్న భారీ చిత్రం 'సాహో' కూడా చరిత్ర సృష్టించాలని కోరుకుంటున్నారు. దాదాపు ప్రభాస్ హోం బేనర్ వంటి 'యువి క్రియేషన్స్'లో రూపొందుతున్న ఈ చిత్రానికి ఒకే ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజీత్ దర్శకుడు. ఇక విషయానికి వస్తే తమిళంలో మంచి గుర్తింపు ఉన్న నటుడు అరుణ్‌విజయ్. ఈయన నాటి, నేటి సీనియర్ నటుడు విజయ్‌కుమార్ తనయుడు. హీరోగా తమిళంలోకి పరిచయం అయిన గౌతమ్‌మీనన్ దర్శకత్వంలో అజిత్ నటించిన 'ఎంత వాడు గానీ' చిత్రం ద్వారా తమిళంలో, తెలుగులో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత రామ్‌చరణ్ 'బ్రూస్‌లీ' చిత్రంతో తెలుగులోకి స్ట్రెయిట్‌గా ఎంట్రీ ఇచ్చాడు. ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచినా కూడా అరుణ్‌విజయ్‌కి మాత్రం మంచి గుర్తింపే వచ్చింది.
ఇక ప్రస్తుతం ఆయన ప్రభాస్ 'సాహో'లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. తాజాగా ఆయన మాట్లాడుతూ, మణిరత్నం సార్ దర్శకత్వంలో నేను పోషించిన త్యాగు పాత్ర 'నవాబ్' చిత్రం ద్వారా మంచి పేరు తెచ్చింది. మొదట మణిసార్‌తో చేయాలంటే భయపడ్డాను. కానీ అరవింద్‌స్వామినే భయంలేదు. ఏదైనా అనుమానం ఉంటే దర్శకుడిని అడుగు అని ప్రోత్సహించారు. ఎందరో పెద్దపెద్ద నటీనటులతో, మణిరత్నం సార్‌తో పనిచేయడం నాకెంతో ఆనందంగా ఉంది. మంచి ఆదరణ కూడా లభిస్తుండటం మరింత ఉత్సాహంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో 'తడం' అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాను. మంచి కథా బలం ఉన్న చిత్రాలలో మంచి పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను. 'బ్రూస్‌లీ' తర్వాత తెలుగులో పలు అవకాశాలు వచ్చినా మరో మంచి చిత్రం చేయాలని వెయిట్ చేశాను.
అలాంటి సమయంలో ప్రభాస్ నటిస్తున్న 'సాహో' చిత్రంలో అవకాశం వచ్చింది. ఈ చిత్రం అద్భుతంగా వస్తోంది. 'బాహుబలి'ని మించిన స్థాయిలో 'సాహో' ఉంటుంది. మరి అవకాశం వస్తే తెలుగు చిత్రంలో నేరుగా హీరోగా నటించాలని ఉంది అని తన మనసులోని భావాలను చెప్పుకొచ్చాడు. మరి 'బాహుబలి'ని మించిన స్థాయిలో 'సాహో' ఉంటుందని చెప్పడం ద్వారా ఈయన 'సాహో' చిత్రంపై అమాంతం అంచనాలను పెంచేశాడు.
By October 01, 2018 at 09:01AM
Read More
No comments