ఉదయనిధి తల నరికి తెస్తే రూ.10 కోట్లు ఇస్తా.. అయోధ్య స్వామీజీ సంచలన ప్రకటన
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా, మత అల్లర్లు సృష్టించే విధంగా ఉన్నాయని హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. దీనిపై ఢిల్లీకి చెందిన ఓ లాయర్ ఆయనపై ఫిర్యాదు కూడా చేశారు. అయితే, ఈ విషయంలో తాను బీజేపీ బెదిరింపులకు భయపడేది లేదని, దేనికైనా సిద్ధమని ఉదయనిధి స్టాలిన్ పునరుద్ఘాటించారు. సనాతన ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడటాన్ని ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. అందరికీ అన్నీ దక్కాలన్నదే ద్రావిడ మోడల్ ఉద్దేశమని తెలిపారు.
By September 05, 2023 at 11:25AM
By September 05, 2023 at 11:25AM
No comments