Uttarakhand: కేదార్‌నాథ్ మార్గంలో విరిగిపడ్డ కొండచరియలు.. 13 మంది భూస్థాపితం?
Uttarakhand: ఉత్తర భారతంలో దాదాపు నాలుగు వారాల నుంచి కురుస్తోన్న కుండపోత వర్షాలతో జనజీవనం అతలా కుతలమైంది. అనేక రాష్ట్రాల్లో కొండచరియలు విరిగిపడి పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. ఉత్తరాఖండ్, హిమాచల్‌లో వంతెనలు, ఇళ్లు కూలిపోయాయి. హిమాచల్ ప్రదేశ్‌లో ఇప్పటి వరకూ 199 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో గురువారం రాత్రి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షం కురవడంతో మరోసారి కొండచరియలు విరిగిపడ్డాయి. శిథిలాల కింద చిక్కుకున్న బాధితులు ప్రాణాలతో బయటపడే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని అధికారులు తెలిపారు.
By August 04, 2023 at 10:54AM
By August 04, 2023 at 10:54AM
No comments