వచ్చే ఎన్నికల్లో అమేథీ నుంచి రాహుల్ గాంధీ పోటీ.. యూపీ కాంగ్రెస్ చీఫ్
మోదీ ఇంటి పేరు విషయంలో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసి వ్యాఖ్యలతో ఆయనకు న్యాయపరమైన ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ కేసులో గుజరాత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించగా.. హైకోర్టు వరకూ ఆయనకు ఊరట లభించలేదు. చివరకు సుప్రీంకోర్టు స్టే విధించడంతో మళ్లీ పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీ మళ్లీ ఎక్కడ నుంచి పోటీలో ఉంటారనే చర్చ ప్రస్తుతం తీవ్రంగా జరుగుతోంది.
By August 19, 2023 at 09:05AM
By August 19, 2023 at 09:05AM
No comments