అమావాస్యకు, నేరాలకు సంబంధం ఏంటి?. పోలీసులకు పంచాంగం పంపిన డీజీపీ!
అమావాస్య రోజుల్లో నేరాలు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయని.. వాటిని అరికట్టడానికి పంచాంగాన్ని అనుసరించాలని సాక్షాత్తు పోలీస్ బాస్ సర్క్యులర్ జారీ చేయడం చర్చకు దారితీసింది. దీనిపై పలువురు భిన్నాభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆధునిక కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలేంటని ప్రశ్నిస్తున్నారు. అమావాస్యకు.. నేరాలకు సంబంధం ఉంటుందా? ఇదేమి చోద్యమని అంటున్నారు. అయితే, డీజీపీ మాత్రం నేరాలకు సంబంధించిన గణాంకాలను విశ్లేషించి.. ఈ లేఖను పంపినట్టు తెలుస్తోంది. నేరాల హాట్‌స్పాట్‌లు గుర్తించాలని సూచించారు.
By August 22, 2023 at 08:38AM
By August 22, 2023 at 08:38AM
No comments