హిమాచల్‌లో వరద బీభత్సం.. 52 మంది మృతి.. భయానక వీడియో షేర్ చేసిన సీఎం
హిమాలయ రాష్ట్రాల్లో ఆకాశానికి చిల్లులు పడ్డాయా? అన్నట్టు వర్షాలు కురుస్తున్నాయి. శివాలిక్ రాష్ట్రాలైన హిమాచల్, ఉత్తరాఖండ్‌లలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. ఒక్క హిమాచల్‌లో వేర్వేరు చోట్ల కొండచరియలు విరిగిపడి వరదలు కారణంగా 50 మందికిపైగా మృతిచెందారు. పౌరులంతా ఇళ్లలోనే ఉండాలని, కాలువలు, నదుల వద్దకు వెళ్లొద్దని సీఎం సుఖ్విందర్ సింగ్ సుఖు హెచ్చరించారు. ఇదే సమయంలో ఉత్తరాఖండ్‌లోనూ వర్షాలు ముంచెత్తడంతో ఛార్ ధామ్ మార్గంలో కొండచరియలు విరిగిపడ్డాయి.
By August 15, 2023 at 09:12AM
By August 15, 2023 at 09:12AM
No comments