Kerala: దారుణం.. ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం.. చిత్రహింసలకు గురిచేసి గొంతునులిపి హత్య
Kerala: దేశంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. రోజూ ఏదో ఒక చోట కామాంధులకు చిక్కి అనేక మంది బలవుతున్నారు. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా దారుణానికి ఒడిగడుతున్నారు. ఎన్ని కఠిన శిక్షలు విధించినా, చట్టాలను తీసుకొచ్చినా దాడులు, అత్యాచారాలు ఆగడం లేదు. మధ్యప్రదేశ్‌లో పదకొండేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడగా.. అదే రోజు కేరళలో మరో బాలిక హత్యాచారానికి గురయ్యింది. వరుస ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
By July 30, 2023 at 12:04PM
By July 30, 2023 at 12:04PM
No comments