Odisha: ఘర పరమద.. ఎదరదరగ వచచన రడ బససల ఢ.. కనస 10 మద మత
Odisha: ప్రయాణికులు గాఢనిద్రలో ఉండగా.. పెను ప్రమాదంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చుట్టూ చిమ్మ చీకట్లు.. ఏం జరిగిందో తెలిసే లోపు పది మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఎదురెదురుగా వస్తున్న రెండు బస్సులు ఒకదానొకటి ఢీకొట్టిన ఘటన సోమవారం తెల్లవారుజామున ఒడిశాలో చోటుచేసుకుంది. గంజాం జిల్లా దిగపహండి పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో గాయపడిన మరి కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. By June 26, 2023 at 09:29AM Read More https://telugu.samayam.com/latest-news/crime/10-killed-and-several-injured-over-two-buses-collied-in-ganjam-district-of-odisha/articleshow/101268198.cms
No comments