స్వీపర్‌కు పురిటినొప్పులు.. ప్లాట్‌ఫామ్‌పైనే ప్రసవం చేసి మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుళ్లు
ఖాకీల మానవత్వానికి ప్రతీకగా నిలిచిన ఘటన రాజస్థాన్‌లోని అజ్మేర్ రైల్వే స్టేషన్‌లో గురువారం చోటుచేసుకుంది. నలుగురు మహిళా కానిస్టేబుళ్లు.. అక్కడ పనిచేస్తోన్న స్వీపర్‌కు పురుడు పోసి తల్లీబిడ్డలను కాపాడారు. వైద్యం గురించి తెలియకపోయినా.. తమకున్న అవగాహనతోనే తోటి మహిళ ప్రాణాలు కాాపాడాలని నిర్ణయించుకున్నారు. ఆస్పత్రికి తీసుకెళ్లే సమయంలో లేకపోవడంతో ఓ వస్త్రాన్ని అడ్డుగా పెట్టి రైల్వే ప్లాట్‌ఫామ్‌నే ఆస్పత్రిగా చేసుకున్నారు. వారి ప్రయత్నం ఫలించి పండంటి పాపకు ఆమె జన్మనిచ్చింది.
By June 02, 2023 at 07:48AM
By June 02, 2023 at 07:48AM
No comments