Rowdy Rohini: సర్జరీకి 10 గంటలు పట్టింది.. చాలా భయపడ్డా.. రౌడీ రోహిణి కంటతడి
నటి ‘రౌడీ’ రోహిణి (Rowdy Rohini) గతంలో యాక్సిడెంట్‌కు గురైనప్పుడు ఆమె కుడి కాలికి గాయమైంది. అప్పుడు వైద్యులు ఆమె కాలిలో రాడ్ వేశారు. దాన్ని తీయించుకోవడంతో రోహిణి అశ్రద్ధ వహించారు. అయితే, హైదరాబాద్‌లో ఇటీవల రాడ్ తీయించుకోవాలని రోహిణి ఆస్పత్రిలో చేరగా.. సర్జరీ చేసిన వైద్యులు రాడ్ తీయలేక చేతులెత్తేశారు. ఈ విషయాన్ని రోహిణి తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా వెల్లడించారు. అయితే, తాజాగా ఆమె కాలిలో నుంచి రాడ్‌ను మరో వైద్యుడు తొలగించారు. ఈ మేరకు రోహిణికి సర్జరీ పూర్తయ్యింది.
By May 18, 2023 at 07:56AM
By May 18, 2023 at 07:56AM
No comments