PIA Plane: భారత్ గగనతలంలోకి పాక్ విమానం.. అప్రమత్తమైన భారత వైమానికదళం
PIA Plane: గతవారం పాకిస్థాన్ అంతర్జాతీయ ఎయిర్‌లైన్స్ సర్వీసులకు చెందిన విమానం భారత్ గగనతలంలోకి ప్రవేశించడం కలకలం రేగింది. ఈ ఘటన గురించి భారత వాయుసేనకు ముందే సమాచారం వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మే 4న బోయింగ్ 777 పీకే 248 విమానం మస్కట్ నుంచి లాహోర్‌కు బయలుదేరింది. అల్లామా ఇక్బాల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి విమానం చేరుకున్న సమయంలో భారీ వర్షం కురుస్తోంది. దీంతో రన్‌వే పూర్తిగా కనిపించకపోవడం వల్ల పైలట్ ల్యాండింగ్ విరమించుకున్నారు.
By May 08, 2023 at 11:08AM
By May 08, 2023 at 11:08AM
No comments