New Cities: నానాటికీ పట్టణాలపై పెరుగుతోన్న భారం.. కొత్తగా 8 సిటీలు ఏర్పాటుకు కేంద్రం ప్లాన్
New Cities: ఇప్పటికే దేశంలో నాలుగు వేలకుపైగా నగరాలు ఉన్నాయి. పట్టణాలకు జనం వలసలు పెరగడంతో భారం ఎక్కువ అవుతోంది. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా కొత్త నగరాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్ ఊపందుకుంది. ఈ నేపథ్యంలోత్వరలో మరో ఎనిమిది నగరాలు పెరగనున్నాయి. దేశంలో కొత్తగా ఎనిమిది నగరాలను ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ఆలోచిస్తోందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. నానాటికీ పెరుగుతున్న జనాభా భారాన్ని తగ్గించేందుకు వీటిని అభివృద్ధి చేసే ప్రణాళిక పరిశీలనలో ఉందని ఆయన చెప్పారు.
By May 19, 2023 at 08:59AM
By May 19, 2023 at 08:59AM
No comments