Breaking News

Manipur: మణిపూర్ హింసలో 54 మంది మృతి.. 200 మందికిపైగా గాయాలు


Manipur హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌‌‌లో హింస చెలరేగింది. గిరిజనులు, గిరిజనేతరుల మధ్య హింసాత్మక ఘర్షణలతో ఆ రాష్ట్రం అట్టుడుకుతోంది. ప్రార్థనా స్థలాలు, వాహనాలకు నిరసనకారులు నిప్పంటించి భారీగా ఆస్తి, ప్రాణనష్టం కలిగించారు. ఈ హింసను అదుపుచేయడానికి పెద్ద సంఖ్యలో సైనిక బలగాలను మోహరించారు. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించిన ప్రభుత్వం.. అవసరమైతే ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేసింది. ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేసింది.

By May 07, 2023 at 06:41AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/more-than-50-killed-and-hundreds-flee-in-manipur-clashes/articleshow/100044128.cms

No comments