ఎలా వస్తాయిరా బాబు మీకు ఇలాంటి ఐడియాలు.. రూ. 2000 నోట్ల ఉపసంహరణపై సోషల్ మీడియాలో ట్రోల్స్..
Trolls: దేశంలో రూ. 2000 నోట్ల చెలామణిని ఉపసంహరించుకుంటూ మే 19 (శుక్రవారం) రోజున భారత రిజర్వ్ బ్యాంకు - ఆర్‌బీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. దీనిపై సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లు జోరందుకున్నాయి. రూ. 2000 నోటుకు పూలదండ వేస్తూ ఉన్న ఫొటోలను నెటిజన్లు తెగ షేర్ చేస్తున్నారు. #RIP హ్యాష్‌టాగ్‌లతో విపరీతంగా ట్రెండ్ చేస్తున్నారు. 2016 లో పుట్టిన రూ. 2000 నోటుకు అప్పుడే కాలం చెల్లిపోయిందా అంటూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు. కొందరేమో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయం సరైందేనని.. మరికొందరేమే ఇది తెలివితక్కువ నిర్ణయమని వాయించేస్తున్నారు. ఏదేమైనా ట్రోలర్స్‌కు మాత్రం ఒక మంచి మసాలా దొరికేసింది.
By May 20, 2023 at 10:54AM
By May 20, 2023 at 10:54AM
No comments