Breaking News

Meerut Riots: 72 మంది ఊచకోత కేసు.. 36 ఏళ్ల తర్వాత నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ కోర్టు సంచలన తీర్పు


యూపీలోని ఓ ఊచకోత కేసుకు సంబంధించి స్థానిక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ ఘటనలో 72 మంది ప్రాణాలు పోతే.. అరెస్టైన నిందితులను నిర్దోషులుగా ప్రకటించడం గమనార్హం. మీరట్ జిల్లా మాల్యానాలో 1987 మే 23న మారణహోమం జరిగింది. ప్రావిన్షియల్ సాయుధ కాన్‌స్టాబులరీ భారీ బృందంతో పాటు వందలాది మంది స్థానికులు తుపాకులు, కత్తులతో మాల్యానాలోకి ప్రవేశించి అక్కడ ప్రజలను దొరికినవారి దొరికినట్టు చంపేశారు. లోపలి ఉన్నవారు ఎవరూ బయటకు పోకుండా ఆ ప్రాంతంలోని మొత్తం ఐదు ఎంట్రీ పాయింట్లను బ్లాక్ చేసి ఊచకోతకు తెగబడ్డారు.

By April 03, 2023 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/all-39-accused-acquitted-by-local-court-in-36-years-back-72-were-killed-maliyana-massacre-of-uttar-pradesh/articleshow/99201193.cms

No comments