Breaking News

Gaganyaan: మానవసహిత ప్రయోగంలో ముందడుగు.. కీలక క్రూ మాడ్యూల్ టెస్ట్ విజయవంతం


ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న మానవ సహిత ఉపగ్రహ ప్రాజెక్టు ‘గగన్‌యాన్‌’‌పై కరోనా తీవ్ర ప్రభావం చూపింది. దీని వల్ల ప్రయోగం నిర్దేశిత సమయం కంటే మరింత ఆలస్యమవుతోంది. ఉపగ్రహంలో ప్రయాణించే నలుగురు భారత వ్యోమగాములు ఇప్పటికే రష్యాలోని జెనరిక్‌ స్పేస్‌ విభాగంలో శిక్షణ తీసుకున్నారు. ఇస్రో బాహుబలి వాహకనౌక జీఎస్‌ఎల్‌వీ ఎంకే-3 ద్వారా గగన్‌యాన్‌ను తరలించనున్నారు. వ్యోమనౌక భూమికి రీ-ఎంట్రీ సమయంలో సర్వీస్ మాడ్యూల్ వేరుచేసిన తర్వాత వ్యోమగాములకు యాక్సిస్ నియంత్రణ అందించే మిషన్‌‌లో మరో కీలక పరీక్ష విజయవంతమైంది.

By April 07, 2023 at 11:03AM


Read More https://telugu.samayam.com/latest-news/science-technology/isros-gaganyaan-mission-key-tests-of-crew-module-propulsion-human-rated-vikas-done/articleshow/99313401.cms

No comments