నేటి నుంచే చార్‌ధామ్ యాత్ర.. ఉఖీమఠ్ నుంచి కేదార్‌నాథ్‌కు ఆది దేవుడు..
దేశంలోని 12 జ్యోతిర్లింగ శైవక్షేత్రాల్లో పదకొండోది కేదార్‌నాథ్ ఆలయం. ఈ ఆలయాన్ని ద్వాపర యుగంలో పాండవులు నిర్మించారని భక్తుల నమ్మకం. అద్వైత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యులు ఇక్కడే శివైక్యం చెందారని భావిస్తారు. 2013 వరదల సమయంలో ఈ సమాధి దెబ్బతింది. దీంతో ఇక్కడ 12 అడుగుల ఎత్తైన ఆదిశంకరుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ధ్యానమందిరాన్ని నిర్మించారు. ఏడాదిలో ఆరు నెలల పాటు సాగే ఈ యాత్ర ఏటా అక్షయ తృతీయ రోజున అధికారికంగా ప్రారంభమవుతుంది.
By April 22, 2023 at 09:23AM
By April 22, 2023 at 09:23AM
No comments