ఇండోర్ ఆలయ విషాదం.. 35కు చేరిన మృతుల సంఖ్య
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ఆలయంలో మెట్లబావి (Well) పైకప్పు కూలి 40మందికిపైగా భక్తులు అందులో పడిపోయారు. వీరిలో 13 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తొలుత అధికారులు తెలిపారు. కానీ, ఈ సంఖ్య భారీగానే ఉన్నట్టు తాజాగా ప్రకటించారు. ఏకంగా 35 మంది చనిపోయాగా.. మరికొందరు గాయపడ్డారు. పటేల్ నగర్ ప్రాంతంలోని బేలేశ్వర్ మహదేవ్ జులేలాల్ ఆలయంలో జరుగుతోన్న శ్రీరామనవమి వేడుకలకు భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు అక్కడ చోటు లేకపోవడంతో బావిపైకప్పు మీద కూర్చున్నారు.
By March 31, 2023 at 09:58AM
By March 31, 2023 at 09:58AM
No comments