నేడు బెంగళూరులో ఆసియాలోనే అతిపెద్ద ఎయిర్ షో ప్రారంభం.. ప్రత్యేకతలు ఎన్నో
వైమానిక విన్యాసాలు.. ఏరో ఇండియా- 2023 ప్రదర్శనను ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం రాత్రి బెంగళూరు చేరుకున్నారు. హెచ్‌ఏఎల్ విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయనకు కర్ణాటక గవర్నర్, ముఖ్యమంత్రి స్వాగతం పలికారు. ఏరో ఇండియా ప్రదర్శన నేపథ్యంలో బెంగళూరు- హైదరాబాద్ జాతీయ రహదారిపై వాహనాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు చేపట్టారు. శాంతిభద్రతల సమస్యలూ ఎదురుకాకుండా దారి పొడవునా ప్రత్యేక రక్షణ బలగాలను అందుబాటులో ఉంచారు.
By February 13, 2023 at 09:08AM
By February 13, 2023 at 09:08AM
No comments