టర్కీ, సిరియాలో అంతులేని విషాదం.. 21 వేలు దాటిన మృతులు
గత సోమవారం ప్రకృతి సృష్టించిన భూప్రళయం టర్కీ, సిరియాలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేల్‌పై 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి వేల సంఖ్యలో భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకుని వేలాది మంది జీవితాలు ముగిసిపోయాయి. ఆ ప్రకంపనల తీవ్రతకు ఏకంగా టర్కీ దేశమే భౌగోళికంగా కదిలిపోయింది. తమవారు ప్రాణాలతో ఉంటారనే బాధితుల ఆశలు మసకబారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనాలకు మించి అక్కడ మరణాలు నమోదయ్యాయి.
By February 10, 2023 at 09:34AM
By February 10, 2023 at 09:34AM
No comments