Breaking News

Gujarat Poll: ఓటు వేయడానికి పెళ్లి వాయిదా వేసుకున్న వరుడు...!


గుజరాత్ (Gujarat Poll) తొలి విడత పోలింగ్‌లో అరుదైన ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రాల దగ్గర కొత్త జంటలు సందడి చేశాయి. కొత్తగా పెళ్లి చేసుకున్న జంటలు.. పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెళ్లి దుస్తుల్లో ఓట్లు వేసిన అమ్మాయిలు, అబ్బాయిలు ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఓ యువకుడు ఏకంగా తన ఓటు వేయడం కోసం తన పెళ్లినే వాయిదా వేసుకున్నాడు. ప్రతి ఒక్కరూ తమ ఓటు వినియోగించుకోవాలని పిలుపునిచ్చాడు.

By December 02, 2022 at 01:49PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/man-reschedules-his-wedding-timings-to-cast-his-vote-during-gujarat-poll/articleshow/95935061.cms

No comments