కార్లు కూడా మేమే తయారు చేసుకోవాలి.. Project K పూర్తిగా భిన్నం: నాగ్ అశ్విన్

ప్రభాస్ (Prabhas) హీరోగా వైజయంతీ మూవీస్ నిర్మిస్తోన్న భారీ చిత్రం Project K. ఈ సినిమాను ప్రకటించి రెండేళ్లు గడిచింది. భారీ నిర్మాణ విలువలతో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా మూవీకి సంబంధించి ఒక పోస్టర్ తప్ప అప్‌డేట్స్ ఏమీ లేవు. అయితే, ఈ సినిమా ఆలస్యం కావడంపై దర్శకుడు నాగ్ అశ్విన్ స్పందించారు. అసలు Project K సాధారణ సినిమా లాంటిది కాదని వివరించారు. ప్రొడక్షన్ డిజైన్ విషయంలో ఇది పూర్తిగా కొత్త సినిమా అని అన్నారు. ఈ సినిమాను ఎలా చేయాలి అని ఆలోచించడానికే చాలా సమయం పడుతుందని వెల్లడించారు.
By November 19, 2022 at 07:51AM
By November 19, 2022 at 07:51AM
No comments