G20: ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలుకరింపు

Modi Jinping Shake Hand: భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ సుమారు రెండేళ్ల తర్వాత పరస్పరం పలుకరించుకున్నారు. ఇండోనేషియాలోని బాలిలో జరుగుతున్న జీ-20 సమావేశాలు ఇందుకు వేదికైంది. మోదీ, జిన్‌పింగ్ పరస్పరం కరచాలనం చేసుకున్న వీడియో వైరల్ అవుతోంది. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో చోటు చేసుకున్న ఘర్షణ అనంతరం భారత్, చైనా మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. సరిహద్దులో తరచూ కవ్వింపు చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి.
By November 15, 2022 at 11:51PM
By November 15, 2022 at 11:51PM
No comments