సెల్ఫ్ డబ్బా అవసరం.. హనుమంతుడు చేసిందదే: మోహన్ బాబు

Mohan Babu: మంచు విష్ణు సారథ్యంలోని మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త గవర్నింగ్ బాడీ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏడాది పూర్తిచేసుకున్న విష్ణు టీమ్‌ను ఆయన అభినందించారు. మనం చేసే మంచి పనులు అందరికీ చెప్పుకోవడంలో తప్పులేదని.. దీన్ని సెల్ఫ్ డబ్బా అనరని ఆయన అన్నారు. ఆంజనేయుడి అంతటివాడే తన గురించి తాను రావణాశురిడి దగ్గర చెప్పుకోవాల్సి వచ్చిందని చెప్పారు.
By October 13, 2022 at 11:38PM
By October 13, 2022 at 11:38PM
No comments