బద్రీనాథ్, కేదార్‌నాథ్ సందర్శించిన ముకేశ్ అంబానీ.. రూ.5 కోట్ల విరాళం

Mukesh Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ ఆలయాల సందర్శన కొనసాగుతోంది. కాబోయే కోడలు రాధిక మర్చంట్‌తో కలిసి ఆయన కేదర్‌నాథ్, బద్రీనాథ్ ఆలయాలను సందర్శించారు. రెండు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీకి రూ. 5 కోట్ల చెక్కును విరాళంగా అందజేశారు. రెండు వారాలుగా ముకేశ్ అంబానీ పలు ఆలయాలను సందర్శిస్తున్నారు. తిరుమల, కేరళలోని గురువాయూర్ ఆలయాలను సందర్శించారు. రిలయన్స్ జియో 5G టెలికామ్ సేవలు దీపావళి నుంచి పలు నగరాల్లో అందుబాటులోకి రానున్నాయి.
By October 13, 2022 at 10:56PM
By October 13, 2022 at 10:56PM
No comments