సఫారీ పార్క్‌లో సందడి చేస్తున్న చిరుతకూనలు
Siliguri: చిరుతపులి పిల్లలను చూసేందుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురిలోని సఫారీ పార్క్‌లో 4 చిరుతకూనలు సందడి చేస్తున్నాయి. ముద్దు ముద్దుగా కనిపిస్తున్న ఈ చిరుతకూనలు జూలోకి వచ్చే వారిని ఆకర్షిస్తున్నాయి. సిలిగురికి సమీపంలోని బెంగాల్ సఫారీ పార్కులోకి అక్టోబర్ 10న వీటిని విడుదల చేశారు. పర్యాటకుల సందర్శన కోసం ఓపెన్ టైగర్ ఎన్‌క్లోజర్‌లోకి వదిలిపెట్టారు. ఓపెన్ ఎన్‌క్లోజర్‌లో స్వేచ్ఛగా తిరుగుతూ సందడి చేస్తున్నాయి. వీటిని స్వేచ్ఛగా వదిలేందుకు ఇదే సరైన సమయమని జూ అధికారులు తెలిపారు.
By October 11, 2022 at 11:03PM
By October 11, 2022 at 11:03PM
No comments