Adolf Hitler చేతి గడియారం వేలం.. ఎన్ని కోట్ల రూపాయలు పలికిందంటే..?

యూదు జాతి వినాశకారిగా పేరొందిన నాజీ పార్టీ వ్యవస్థాపకుడు అడాల్ఫ్ హిట్లర్ చేతి గడియారం కోట్ల రూపాయల్లో పలికింది. అమెరికాలోని మేరీల్యాండ్‌లో ఉన్న అలెగ్జాండర్ హిస్టారికల్ వేలంలో హిట్లర్ వాచ్‌ని వేలం వేశారు. ఈ గడియారం 1.1 మిలియన్ డాలర్లు అంటే దాదాపు 8 కోట్ల 71 లక్షల రూపాయలు పలికినట్లు వేలం అధికారులు స్పష్టం చేశారు. హుబర్ కంపెనీకి చెందిన ఈ గడియారాన్ని యురోపియన్‌కు చెందిన ఒక అజ్ఞాతవాసి కొనుగోలు చేశాడు.
By August 02, 2022 at 07:25AM
By August 02, 2022 at 07:25AM
No comments