15 సెకన్లలో కుప్పకూలనున్న నోయిడా ట్విన్ టవర్స్.. సర్వత్రా ఉత్కంఠ, అసలేం జరిగింది?
నేడు దేశం దృష్టి మొత్తం నోయిడాలోని ట్విన్ టవర్స్ పైనే ఉంది. 100 మీటర్ల పొడవైన, 40 అంతస్తుల Supertech Twin Towers ఆదివారం (ఆగస్టు 28) మధ్యాహ్నం ఒక్కపెట్టున నేలమట్టం కానున్నాయి. కేవలం 15 సెకన్లలోనే ఇవి పేకమేడల్లా కూలిపోనున్నాయి. తొమ్మిదేళ్లుగా పనులు కొనసాగిన ఈ టవర్స్ నిర్మాణానికి నిర్మాణ సంస్థ రూ.1000 కోట్లు ఖర్చు చేసింది. ఇప్పుడు ఈ టవర్స్‌ను కూల్చివేసేందుకు రూ. 20 కోట్లు ఖర్చవుతోంది. వీటిని కూల్చేందుకు 3,700 కిలోల పేలుడు పదార్థాలను అమర్చారు. కూల్చివేత తర్వాత 80,000 టన్నుల వ్యర్థాలు వస్తాయని అంచనా వేస్తున్నారు. వీటిలో 50 వేల టన్నుల వ్యర్థాలను ఈ జంట భవనాలు ఉన్న ప్రాంతంలోనే భారీ గోతిలో నిర్వీర్యం చేసేందుకు ఏర్పాట్లు చేయగా.. మిగిలిన 30 వేల టన్నుల వ్యర్థాలను వేరే చోటకు తరలించి, సాంకేతికంగా ప్రాసెస్ చేయించి వాటి నుంచి టైల్స్ తయారు చేయనున్నారు. ఢిల్లీలోని కుతుబ్ మినార్ కంటే ఎత్తైన ఈ టవర్స్‌ను ఎందుకు కూల్చివేయాల్సి వచ్చింది? కూల్చివేతకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు?
By August 28, 2022 at 02:22AM
By August 28, 2022 at 02:22AM
No comments