ఈద్ వేళ రాజస్థాన్‌లో ఘర్షణలు.. జోద్‌పూర్ పరిసరాల్లో ఇంటెర్నెట్ నిలిపివేత
గడచిన గత కొద్ది వారాలుగా దేశంలోని పలు ప్రాంతాల్లో మత ఘర్షణలు చెలరేగడం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల కాలంలో ఎన్నడూ లేనివిధంగా ఇరు వర్గాల మధ్య జరుగుతున్న ఘర్షణలపై ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడటం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. నవమి, హనుమాన్ జయంతి శోభయాత్రల్లో అవాంఛనీయ ఘటనలు తలెత్తి నలుగురు ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు. తాజాగా, ముస్లిం సోదరులకు ముఖ్యమైన ఈద్ రోజున రాజస్థాన్‌లో ఘర్షణలు చోటుచేసుకోవడం కలవరానికి గురిచేస్తోంది.
By May 03, 2022 at 10:57AM
By May 03, 2022 at 10:57AM
No comments