యుద్ధంలో అత్యాచారాన్ని ఆయుధంగా వాడుతున్న రష్యా.. ఐరాసకు ఫిర్యాదు

ఉక్రెయిన్‌లో రష్యా సైన్యం దారుణాలకు పాల్పడుతోంది. సాధారణ పౌరులపై విచక్షణారహితంగా దాడులకు తెగబడుతోంది. అంతేకాదు, మహిళలు, బాలికలపై అత్యాచారాలకు తెగబడిన ఘటనలు వెలుగులోకి రావడంతో అంతర్జాతీయ సమాజం తీవ్రంగా మండిపడుతోంది. ఈ నేపథ్యంలో ఐరాసకు ఉక్రెయిన్‌కు చెందిన ఓ మానవహక్కుల సంఘం ఫిర్యాదు చేసింది. బుచాలో సామూహిక ఖననంపై ప్రపంచ దేశాలు భగ్గుమంటున్నాయి. రష్యన్ల దమనకాండను ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. తాజాగా, అత్యాచారాలపై ఐరాస విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
By April 12, 2022 at 10:15AM
By April 12, 2022 at 10:15AM
No comments